ప్రస్తుత కాలంలో చాలామంది శ్రీగంధం సాగువైపు ఆకర్షితులు అవుతున్నారు. ఆయుర్వేదంలో శ్రీగంధంను ఎక్కువగా వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. ఇతర మొక్కలతో పోలిస్తే శ్రీ గంధం మొక్కలలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అగరబత్తులు, పర్ఫ్యూమ్ లతో పాటు సౌందర్య ఉత్పత్తులలో శ్రీగంధంను ఎక్కువగా వాడతారు. శ్రీగంధం సాగును చేపట్టే రైతులు తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి.
సేంద్రీయ పదార్థాలు ఉండే నేలలు శ్రీ గంధం సాగుకు అనుకూలమైన నేలలు అని చెప్పవచ్చు. ఒండ్రు నేలలు, ఇసుక నేలలలో కూడా శ్రీ గంధంను సాగు చేయవచ్చు. మురుగునీరు పారుదల ఉంటే మాత్రమే శ్రీ గంధం సాగు చేస్తే మంచిది. అనుకూలత ఉన్న నేలలలో శ్రీ గంధంను సాగు చేయడం వల్ల లాభాలను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఎకరానికి 250 చెట్లను నాటుకుంటే మంచిది.
శ్రీగంధంను నాటిన తర్వాత 25 సంవత్సరాలకు చేవ 25 కేజీల వరకు చేవ ఇస్తుంది. నర్సరీలలో పెరిగిన మొక్కలను ఇందుకోసం ఎంపిక చేసుకోవాలి. వేసవికాలంలో ప్రతి రెండు వారాలకు ఒకసారై నీళ్లను అందించాలి. పశువుల ఎరువు,కంపోస్ట్ , వర్మీకంపోస్ట్ , కుళ్ళిన సేంద్రీయ ఎరువులను అందిస్తే శ్రీగంధం సాగు చేసేవాళ్లకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
మార్కెట్లో శ్రీగంధం కిలో 8,000 రూపాయల వరకు ఉంటుంది. పెట్టుబడి తక్కువగా ఉండటంతో పాటు దీర్ఘకాలంలో మంచి రాబడినిస్తుంది కాబట్టి శ్రీగంధం సాగుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు.