Maruti Swift Saies
Swift Desire : దేశంలోని కాళ్ల ఉత్పత్తిలో Maruthi కంపెనీ ముందంజలో ఉంటుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఇప్పటికే చాలా మోడళ్లు యోగదారులను ఆకర్షించాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే మారుతూ నుంచి మార్కెట్లోకి వచ్చిన కొన్ని కార్లు ఎవరు గ్రీన్ గా నిలుస్తూ ఉంటాయి. వీటిలో Swift, Wagon R వంటివి ఉన్నాయి. వీటితోపాటు స్విఫ్ట్ Desire కూడా అత్యధికంగా ఆదరణ పొందింది. ఫోర్ సీటర్ కలిగిన డిజైర్ ను ఎక్కువమంది ఇప్పటికే కొనుగోలు చేశారు. అప్డేట్ గా వచ్చిన దీనిని గత సంవత్సరంలో చాలామంది సొంతం చేసుకున్నారు. అయితే కొత్త ఏడాదిలో డిజైర్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అసలేం జరిగిందంటే?
మారుతి Swift Desire మిడిల్ క్లాస్ కు అనుగుణంగా ఉంటుంది. దీని ఫీచర్స్ ఆకట్టుకునే విధంగా ఉంటూ తక్కువ ధరలోని రావడంతో చాలామంది దీనిని లైక్ చేశారు. గతంలో టాప్ లెవల్ లో ఉన్న డిజైర్ కొత్త ఏడాది 2025 లో మాత్రం పూర్తిగా వెనుకబడిపోయింది. ముఖ్యంగా జనవరి 2025లో Swift Desire 9వ స్థానానికి పడిపోయింది. అయితే ఈ పరిస్థితి ఎప్పటికీ ఉండదని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఇంతకీ గత నెలలో ఎన్ని యూనిట్లు అమ్మకాలు చేసుకుందంటే?
కొన్ని నివేదికల ప్రకారం 2025 జనవరిలోSwift Desire కారును 15,383 మంది కొనుగోలు చేశారు. ఇదే నెల 2024లో 16,673 యూనిట్లు విక్రయాలు జరిగాయి. గత ఏడాది కంటే ఈ సంవత్సరం 8 శాతం వృద్ధి క్షీణించింది. దీంతో టాప్ లెవల్ లో ఉన్న కార్లలో తొమ్మిదవ స్థానానికి పడిపోయింది. అయితే ఓవరాల్ గా కార్ల అమ్మకాలలో మారుతి 4.1 శాతం వృద్ధితో ముందంజలో ఉన్నప్పటికీ డిజైర్ మాత్రం తక్కువ మంది కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కారు కు రానున్న రోజుల్లో ఆదరణ ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కంపెనీ ప్రతినిధులు మాత్రం వచ్చే నెలలో ఈ పరిస్థితి ఉండదని అంటున్నారు.
గత సంవత్సరంలో డిజైన్ అప్డేట్ కార్ వచ్చిన తర్వాత చాలామంది కొనుగోలు చేశారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్కు ఇది అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా లో బడ్జెట్లో ఇది ఉండడంతో దీన్ని సేల్స్ పెరిగాయి. ప్రస్తుతం డిజైర్ రూ. 6.8 లక్షల నుంచి రూ 10.18 లక్షల వరకు విక్రయిస్తున్నారు.Swift Desire కారులో పెట్రోల్ ఇంజన్ తో పాటు డీజిల్ ఇంజన్ కూడా అమర్చారు. పెట్రోల్ ఇంజన్ 1.2 లీటర్, డీజిల్ ఇంజన్ 1.3 లీటర్ తో పనిచేస్తుంది. అలాగే ఇందులో సిఎన్జి ఆప్షన్ను కూడా అమర్చారు. CNG ఆప్షన్ పై 33. 34 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. పై స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే షిఫ్ట్ డిజైర్ కారు మిగతా వాటితో పోలిస్తే మైలేజ్ ఎక్కువగా ఇస్తుంది. ఇందులోని ఫీచర్స్ కూడా ఆకట్టుకోవడంతో చాలామంది కొనుగోలు చేశారు. అయితే రానున్న రోజుల్లో ఈ కారు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.