Mindfullness: ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ ను కలిగి ఉంటున్నారు. విద్యార్థుల నుంచి బడా వ్యాపారుల వరకు ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ లేదా పని చేస్తూ ఉంటున్నారు. దీంతో మెదడుకు తీరిక లేకుండా పోతుంది. ఒకప్పుడు శారీరకంగా ఎంతో శ్రమపడినా.. మానసికంగా దృఢంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మెదడుతో చేసే పనులే ఎక్కువ. అందువల్ల మెదడుకు ఏమాత్రం తీరిక లేకుండా పోతుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనే శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగా రిలాక్స్ కోసం వివిధ వ్యసనాల బారిన పడుతున్నారు. అయితే అలాంటి అవసరం ఏం లేకుండా మనసు అదుపులో ఉంచడానికి మైండ్ ఫుల్ నెస్ ఉపయోగపడుతుందని కొందరు మానసిక నిపుణులు అంటున్నారు. దీనిని చేయడం వల్ల శరీరం అదుపులోకి వచ్చి ఏ పని అయినా చేయడానికి శక్తి వస్తుంది. అదేంటో తెలుసుకుందాం..
ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు మైండ్ ఫుల్ నెస్. ఉద్యోగులు వ్యాపారులు కొందరు విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడిని కలిగి ఉన్నవారు మానసిక ప్రశాంతత కోసం మైండ్ ఫుల్ నెస్ కోసం ఆరాటపడుతున్నారు. మైండ్ ఫుల్ నెస్ అంటే శరీరం అదుపులోకి రావడం. వివిధ పనుల కారణంగా ఆందోళన చెంది ఏ పని కూడా పూర్తిగా చేయలేకపోతూ ఉంటారు. అంతేకాకుండా అనవసర భయాలు ఆందోళనలతో అనారోగ్యాలను కొనితెచ్చుకుంటారు. అయితే దీనిని అధిగమించుకునేందుకు ఈ మధ్య ఎక్కువగా మైండ్ ఫుల్ లెసన్ ఫాలో కావాలని చాలామంది మానసిక నిపుణులు చెబుతున్నారు. అసలు మైండ్ ఫుల్ నెస్ పొందాలంటే ఏం చేయాలి?
వెల్నెస్ అంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం. అదే మైండ్ ఫుల్ నెస్ అంటే మనసును కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రకరకాల పదార్థాలను తినాల్సి ఉంటుంది. కానీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? అయితే ఇప్పటివరకు మెడిటేషన్ వల్ల మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి చాలామంది ప్రయత్నించారు. కానీ మైండ్ ఫుల్ నెస్ లో భాగంగా ఒక చోట కూర్చొని దృష్టిని మొత్తం శ్వాస పైనే ఉంచాలి. వీలైతే ఒకటి నుంచి 100 వరకు కౌంట్ చేసుకోవాలి. తిరిగి వంద నుంచి ఒకటి వరకు తిరిగి కౌంట్ చేయాలి. ఇలా కౌంట్ చేయడం వల్ల దృష్టి మరచ్చకుండా మనం లెక్కించే విధానం పైనే ఉంటుంది. దీంతో మనసు అదుపులోకి వస్తుంది.
ఇలా రోజు సాధన చేసిన వారు ఏ పని చేపట్టినా తమ మనసు అదుపులో ఉండి దానిని పూర్తి చేసుకోవడానికి సిద్ధమవుతారు. ఇలా మైండ్ ఫుల్ నెస్ లో సాధించిన తర్వాత వారి శరీరంలో కొత్త మార్పు వస్తుంది. ఒక పని చేయడానికి ఉత్సాహంగా ముందుకు వస్తారు. అలసత్వాన్ని అంజి మనుషులు వీడి అన్ని పనులు ప్రణాళిక ప్రకారంగా పూర్తి చేస్తారు. అందువల్ల ఇప్పుడున్న కాలంలో మైండ్ ఫుల్ నెస్ ను సాధించడం చాలా అవసరం అని మానసిక నిపుణులు చెబుతున్నారు.