https://oktelugu.com/

Stock Markets: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 24392 పాయింట్లు… అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలే కారణమా..?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లలో సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇక శుక్రవారం ఎర్లీ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 1098, నిఫ్టీ 270 పాయింట్లు లాభపడ్డాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 9, 2024 / 03:38 PM IST

    Stock Markets

    Follow us on

    Stock Markets: రెండు, మూడు రోజుల క్రితం నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. శుక్రవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలవడం మదుపర్లలో ఆనందాన్ని నింపింది. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1098 పాయింట్లు, నిఫ్టీ 270 పాయింట్లు లాభపడ్డాయి. దీంతో పాటు అన్ని కంపెనీలు మంచి లాభాల్లోనే దూసుకెళ్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీస్తుండడంతో, దేశీయ మార్కెట్లు కూడా లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఇక ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్చేంజీ వద్ద సెన్సెక్స్ సూచీ 817 పాయింట్లు లాభపడింది. దీంతో 79,701 వద్ద కొనసాగుతున్నది. ఎన్ఎస్ఈ వద్ద నిఫ్టీ సూచీ 240 పాయింట్లు పెరిగింది. దీంతో 24,357 పాయింట్ల వద్ద కొనసాగుతున్నది. ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, టాటాస్టీల్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, అదానీ, మారుతీ సుజుకి, సన్ ఫార్మా, రిలయన్స్, తదితర కంపెనీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. దీంతో మదుపర్లలో సంతోషం నెలకొంది.

    ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు చూసుకుంటే..
    ఇక అమెరికన్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతోనే ముగిశాయి. నిరుద్యోగ క్లెయిమ్ లు అంచనాల కంటే తక్కువగా నమోదు కావడంతో అక్కడ సూచీలు గణనీయమైన లాభాలను పొందాయి. ఇక శుక్రవారం ఆసియా పసిఫిక్ సూచీలు కూడా భారీ లాభాలతో నడుస్తున్నాయి. ప్రధానంగా ఆసియా మార్కెట్లలో సియోల్, షాంఘై, టోక్యో, హాంకాంగ్ అన్ని దేశాల్లోని స్టాక్ మార్కెట్ల సూచీలు లాభాల బాట పట్టాయి.

    స్టాక్ ఎక్స్చేంజీ డేటా ప్రకారం గురువారం విదేశీ సంస్థాగత మదుపర్లు నికరంగా రూ. 2,267 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. దేశీయ సంస్థాగత మదుపరులు రూ. 577 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఇక ప్రపంచ మార్కెట్ లో రూపాయి విలువ రెండు పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్ తో చూసుకుంటే రూపాయి విలువ రూ. 83.95 గా ఉంది. ఇక ముడిచమురు ధరలు 0.14 శాతంగా పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 79.27 డాలర్లు గా ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లలో సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలు నమోదు చేసుకుంటున్నాయి.

    ‘బ్లాక్ మండే’ నుంచి కోలుకొని
    ఇక నాలుగు రోజుల క్రితం బ్లాక్ మండే తీసిన దెబ్బ నుంచి మదుపర్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కంపెనీలపై బ్లాక్ మండే ప్రభావం తీవ్రంగానే పడింది. అయితే అమెరికాలో ఆర్థిక మాంద్యం, ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్ దెబ్బతింటుందని అంతా భావించారు. అయితే అమెరికాలో నిరుద్యోగ రేటు కొంత తగ్గుతూ వస్తుండడం మార్కెట్లలో పెరుగుదలకు కారణమైంది. ఇక ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సానుకూల సంకేతాల నేపథ్యంలో ఇటు భారత్ లో దేశీయ మార్కెట్లు కూడా లాభాల్లోకి దూసుకెళ్లాయి. అమెరికాతో పాటు మిగతా దేశాల్లోనూ సూచీలు మంచి లాభాలను శుక్రవారం పొందాయి. ఏదేమైనా ఈవారంలో ఆఖరి రోజు ట్రేడింగ్ లాభాలను తెచ్చిపెట్టిందని పలువురు మదుపర్లు సంతోషం వ్యక్తం చేశారు.