Mahesh Babu Assets: టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు ఆస్తుల విలువ తెలుసా? ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారంటే?

మహేష్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ కొల్లగొడతాయి. వందల కోట్ల వసూళ్లు రాబడతాయి. మరి ఇంత పెద్ద హీరో మహేష్ బాబు ఆస్తుల విలువ ఎంత? ఆయన సినిమాకు ఎంత తీసుకుంటారో చూద్దాం...

Written By: S Reddy, Updated On : August 9, 2024 3:34 pm

Mahesh Babu Assets

Follow us on

Mahesh Babu Assets: సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా మహేష్ బాబు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. టాలీవుడ్ టాప్ హీరోగా రాణిస్తున్నాడు. ఆయన సినిమాల ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. టాలీవుడ్ రిచెస్ట్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఖరీదైన కార్లు, లగ్జరీ భవనాలు ఉన్నాయి. మహేష్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు.

బాల నటుడిగా తెరంగేట్రం చేశారు మహేష్ బాబు. తండ్రితో కలిసి ఆయన పలు సినిమాల్లో నటించడం విశేషం. చిన్న వయసులోనే నటనతో మెప్పించారు. పోరాటం, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు వంటి సినిమాల్లో నటించారు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ రాజకుమారుడు ‘ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమానే మంచి విజయం సాధించింది. ఆ తర్వాత పోకిరి, అతడు, దూకుడు, శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

మహేష్ బాబు ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా మూవీలో కూడా నటించలేదు. అయినప్పటికీ ఆయనకు నేషనల్ వైడ్ గా ఫేమ్ ఉంది. మహేష్ బాబు సినిమాల కలెక్షన్స్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబడతాయి. మహేష్ బాబు ప్లాప్ సినిమాలు కూడా బాక్సాఫీస్ కొల్లగొడతాయి. మహేష్ సినిమాకు రూ. 50 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. గుంటూరు కారం మూవీ రూ. 78 కోట్లు తీసుకున్నారని సమాచారం.

సినిమాలతో పాటు బిజినెస్, బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా భారీగా ఆర్జిస్తున్నారు. అలాగే ఆయనకు సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఏఎంబి సినిమాస్ పేరుతో మల్టీ స్క్రీన్ బిజినెస్ చేస్తున్నారు. అలాగే ఓ గార్మెంట్ బ్రాండ్ కూడా ఉంది. తన తండ్రి కృష్ణ ఆస్తుల నుండి కొంత భాగం సంక్రమించింది. జూబ్లీహిల్స్ లో ఓ బంగ్లా ఉంది. దాని విలువ సుమారు రూ. 30 కోట్లు ఉంటుందని అంచనా. మహేష్ బాబు వద్ద లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది.

ఒక అంచనా ప్రకారం మహేష్ బాబు ఆస్తుల విలువ రూ. 250 – 330 కోట్లు. ఆయన సంపాదనలో కొంత మొత్తం చిన్నారుల కోసం ఖర్చు చేస్తున్నారు. ఆయన ఓ ఫౌండేషన్ స్థాపించి చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. 2005లో హీరోయిన్ నమ్రతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి గౌతమ్, సితార సంతానం. మహేష్ బాబు 1975లో ఆగస్టు 9న మద్రాస్ లో జన్మించారు. నేడు ఆయన జన్మదినం. దీంతో సోషల్ మీడియా ద్వారా సినీ సెలబ్రెటీలు, అభిమానులు మహేష్ బాబు కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ SSMB 29. రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా యూనివర్సల్ సబ్జెక్టుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. దాదాపు రూ. 800 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్ బాబు రెమ్యూనరేషన్ రూ. 125 కోట్లు అని సమాచారం. ఈ జంగిల్ అడ్వెంచర్ డ్రామాలో మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కనిపిస్తారట.