Auto Industry: మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ సేవల సంస్థ ప్రిమస్ పార్ట్నర్స్ నివేదిక ప్రకారం భారత ఆటో మొబైల్ పరిశ్రమ విలువ 2024 ఆర్థిక సంవత్సరంలో 19 శాతం వృద్ధితో రూ.10.2 లక్షల కోట్లకు చేరుకుందని వివరించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ రూ.8.6 లక్షల కోట్లుగా ఉంది.
స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ), యుటిలిటీ వెహికల్ (యూవీ) సెగ్మెంట్ల మొత్తం విలువ 39 శాతం పెరిగినట్లు నివేదికలో స్పష్టమైంది. వాటి పరిమాణం 23 శాతం ఇయర్ ఓవర్ ఇయర్, ధర 16% ఇయర్ ఓవర్ ఇయర్ పెరిగింది. సగటు ధరల పెరుగుదల సాధారణం కంటే ఎక్కువగా ఉంది. హై సెగ్మెంట్లు, హైబ్రిడ్లు, ఆటోమేటిక్ వాహనాలకు మారడం, సన్ రూఫ్ మోడల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)కి ప్రజాధరణ పెరిగింది.
ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో స్వల్ప పెరుగుదల కారణంగా ధరల్లో 9% క్షీణతను చూసింది. ఫలితంగా 4% ధర పడిపోయింది. బైకుల విభాగంలో భారత్ వాల్యూమ్ లో 10 శాతం, ఇయర్ ఓవర్ ఇయర్ విలువలో 13 శాతం వృద్ధి చెందగా, మూడు చక్రాల వాహనాల ధరల్లో 16 శాతం, ఇయర్ ఓవర్ ఇయర్ విలువలో 24 శాతం పెరిగింది. కమర్షియల్ వెహికిల్ సెగ్మెంట్ ధరల్లో 3 శాతం, ఇయర్ ఓవర్ ఇయర్ విలువలో 7 శాతం పెరిగింది.
‘ప్రపంచ ఆటో మొబైల్ రేసులో భారత్ ముందంజలో ఉందని, తక్కువ ధరల ఉత్పత్తులను పక్కనపెట్టి రిచ్, అధిక ధరల వాహనాలకు భారతీయులు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఈ పరివర్తనకు వినియోగదారుల ప్రాధాన్యతలు, బలమైన ఆర్థిక మూలాలే కారణం. యూవీ, ఎస్‌యూవీ సెగ్మెంట్లను చాలా మంది భారతీయ వినియోగించేందుకు ఇష్టపడుతున్నారు.’ అని ప్రిమస్ పార్ట్నర్ ఎండీ అనురాగ్ సింగ్ అన్నారు.
నివేదికలోని ముఖ్యాంమైన అంశాలు..
* వాహనాల వాడకంలో చైనా, అమెరికా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉండగా, విలువ పరంగా జపాన్, జర్మనీ వంటి దేశాలను వెనక్కి నెట్టింది. అనేక అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ లో వాహనాల సగటు ధర తక్కువగా ఉంది.
* భారత ఆటోమొబైల్ పరిశ్రమ విలువ వేగంగా పెరుగుతోంది. భారతీయులు అధిక, ఖరీదైన మోడళ్లను ఇష్టపడుతున్నారు. వాహనాల సగటు ధర పెరుగుతోంది.
* గతేడాది 20 మిలియన్ యూనిట్లకు పైగా బైకులను ఉత్పత్తి చేసి భారత్ మొదటి స్థానంలో ఉంది. వాల్యూమ్ లో బైకుల విభాగం 76% వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోంది. దాని వాటా విలువ 18% గా ఉంది.
* వాణిజ్య వాహన విభాగం పరిశ్రమ విలువలో 18% వాటాను కలిగి ఉంది. ట్రక్కులు, స్పెషాలిటీ వాహనాలు వంటి అధిక ధర వాహనాల నుంచి గణనీయమైన సహకారం ఉంది.