https://oktelugu.com/

under Rs.7 lakh Cars : రూ.7 లక్షల లోపు లభించే కార్ల గురించి తెలుసా?

. ఈ తరుణంలో అత్యధికంగాడబ్బున్న వాళ్లు మాత్రమే కొనుగోలు చేసేవారు. ఒకవేళ ధర తక్కువగా ఉంటే అనుకున్నఫీచర్లు ఉండేవి కావు. అయితే కొన్ని కంపెనీలు  అద్భుతమైన ఫీచర్లతో పాటు తక్కువ ధరకు కొన్నికార్లను ఉత్పత్తి చేశాయి.  వాటి గురించితెలుసుకుందాం..

Written By:
  • Srinivas
  • , Updated On : May 28, 2023 / 03:27 PM IST
    Follow us on

    under Rs.7 lakh Cars : నేటి కాలంలో అవసరమున్న ప్రతీ ఒక్క వస్తువు ధరపెరిగిపెతోంది. మనం నిత్యం ప్రయాణించాలనుకునేవాహనరేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. కరోనా కాలం తరువాత చాలా మంది సొంతంగా 4 వీలర్ఉండేలా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కార్లను కొనుక్కుంటున్నారు. అవసరాలతోపాటు షికారు చేయడానికి కారు సాఫ్ట్ గా ఉంటుంది. అందువల్ల దీనికి ప్రిఫరెన్స్ ఇస్తుంటారు.అయితే ఒకప్పుడు కారు కొనాలంటే రూ.10 లక్షల పైమాటే. ఈ తరుణంలో అత్యధికంగాడబ్బున్న వాళ్లు మాత్రమే కొనుగోలు చేసేవారు. ఒకవేళ ధర తక్కువగా ఉంటే అనుకున్నఫీచర్లు ఉండేవి కావు. అయితే కొన్ని కంపెనీలు  అద్భుతమైన ఫీచర్లతో పాటు తక్కువ ధరకు కొన్నికార్లను ఉత్పత్తి చేశాయి.  వాటి గురించితెలుసుకుందాం..

    హుండ్యాయ్ అతి తక్కువ ధరలో కొత్త మోడల్ రాబోతుంది. ఈ కంపెనీ నుంచి వెన్యూ అనే మోడల్ మార్కెట్లోకి రాబోతుంది. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ను కలిగినఈ కారు 120 సీసీ పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 170 ఎన్ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ కారు ధర రూ.6.75 లక్షలు. ఇదే మాదిరిగిగా కియా సోనేట్ కారుకూడా రూ.71 లక్షలకు లభించనుంది. 120 పీఎస్ పవర్, 172 టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఫ్యూయల్ కలిగినఈ కారు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

    ఫోర్డ్ కంపెనీ నుంచి అస్పైర్ అనే మోడల్ రూ.6.09 లక్షలకే మార్కెట్లోకి వచ్చింది. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ తో పాటు 100పీఎస్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. హోండా అమేజ్ అనే కారుకూడా రూ.6.19 లక్షలకు లభిస్తుంది. మాన్యువల్ గేర్ బాక్స్ , 1.5 లీటర్ డీజిల్ ను కలిగి ఉంది. 100 పీఎస్ శక్తిని,200 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

    టాటా కంపెనీ నుంచి కొత్త మోడల్ మార్కెట్లోకి రాబోతుంది. దాని పేరే ‘పంచ్’. 1199 సీసీ ఇంజెన్ తో కలిగిన ఈ వెహికిల్ 86.63 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఫ్యూయల్ ను కలిగిన ఈ కారు ధర రూ.6 లక్షల నుంచి రూ.9.52 లక్షల వరకు విక్రయిస్తున్నారు. టాటా నుంచి మరో మోడల్ నెక్సాన్ మార్కెట్లోకి రాబోతోంది. 1.2 లీటర్ పెట్రోల్ తో పాటు 120 పీఎస్ పవర్, 170 ఎన్ఎం ను ఉత్పత్తి చేస్తోంది. దీనిధర రూ.6.99 లక్షలు.