New Parliament Building : కొత్త పార్లమెంట్‌ భవనం ఓ శవ పేటిక.. మరో పెనుదుమారం!

బీహార్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీ మాత్రం వివాదాస్పద ట్వీట్‌చేసి విమర్శల పాలవుతోంది. కొత్త పార్లమెంట్‌ భవనం నమూనాను శవపేటికతో ఆ పార్టీ పోల్చింది.

Written By: Raj Shekar, Updated On : May 28, 2023 3:34 pm
Follow us on

New Parliament Building : కొత్త పార్లమెంట్‌ భవనం.. నూతన ప్రజాస్వామ్య సౌధం ప్రారంభవోత్సవం అట్టాహసంగా జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ఘనంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలతో వేడుకలు జరుగుతున్నాయి. తమిళనాడుకు చెందిన రాజదండాన్ని స్పీకర్‌ కుర్చీ పక్కన నెలకొల్పారు. కొత్త పార్లమెంట్‌భవనాన్ని కీర్తిస్తూ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు వేడుకలకు గైర్హాజర్‌ అయిన ఆర్జేడీ మాత్రం వివాదాస్పద ట్వీట్‌ చేసి విమర్శలపాలవుతోంది.
ప్రజాస్వామ్య దేవాలయం…
ప్రజాస్వామ్య దేవాలయంగా నూతన పార్లమెంట్‌ను, అన్నివర్గాల ప్రజల కొత్త గృహంగా ప్రముఖులు నూతన పార్లమెంట్‌ను కీర్తిస్తుంటే బీహార్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీ మాత్రం వివాదాస్పద ట్వీట్‌చేసి విమర్శల పాలవుతోంది. కొత్త పార్లమెంట్‌ భవనం నమూనాను శవపేటికతో ఆ పార్టీ పోల్చింది. రెండు ఫొటోలను పక్కపక్కన పెట్టి ట్వీట్‌ చేసింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌జేడీ భవిష్యత్తు శవ పేటిక అంటూ నెటిజన్లు పేర్కొన్నారు.
‘శవపేటిక మీ పార్టీ భవిష్యత్తు , రెండో ఫోటో భారత దేశ భవిష్యత్తు’ అని సౌరభ్‌ మౌర్య అనే నెటిజన్‌ వ్యాఖ్యానించారు.
‘కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణం అద్బుతం’ అని మృణాల్‌ మొహంతి అనే నెటిజన్‌ వ్యాఖ్యానించారు. ఆధునిక డిజైన్‌ ప్రజాస్వామ్యం కోసం ప్రగతిశీ థక్పథాన్ని ఈ నిర్మాణం ప్రతిబింబిస్తుందన్నారు. శవపేటిక లాలూజీ భవిష్యత్‌ అంటూ అఖిలేష్‌ కాంత్‌ఝూ కామెంట్‌ చేశాడు.
బీజేపీ మండిపాటు.. 
ఇక ఆర్జేడీ ట్వీట్‌పై బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ సంకుచిత భావానికి ట్వీట్‌ నిదర్శనమని పేర్కొంటున్నారు. ప్రజాస్వామ్య సౌధాన్ని గౌరవించలేని ఎంపీలు వెంటనే లోక్‌సభ, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి ఆర్జేడీ కూడా సమాధానం ఇచ్చింది. బ్రాహ్మణిజాన్ని బీజేపీ పోషిస్తోందని ఆరోపించింది.