Branded Cars: కారు కొనాలని చాలా మందికి ఉంటుంది. ఫ్యామిలీతో ట్రిప్ లకు, బయటకు వెళ్లాలన్నా ఒక కారు ఉంటే బాగుండు అని కొందరు, వ్యాపారం కోసమని కొందరు, కానీ మొత్తం మీద కారు మీద ఆశలు మాత్రం చాలా మందికి ఉంటాయి. మీకు కూడా ఇలాంటి కోరిక ఉంటే రెనాల్డ్ ఇండియా ఏ సంవత్సరం అద్భుతమైన ఆఫర్లను తీసుకువచ్చింది. క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్ లు, ఎక్స్చేంజ్ బోనస్ లతో మీ ముందుకు వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వివరాలు తెలుసుకోండి
రెనాల్డ్ ట్రైబర్.. ఈ కారు గనుక కొంటే ఏకంగా రూ. 50000 వరకు బెనిఫిట్స్ వస్తాయి. ఇందులోనే రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, మరో 20,000 ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, రూ. 10,000 లాయల్టీ కస్టమర్ ప్రయోజనాలను అందిస్తూ రూ. 50వేలు తగ్గిస్తుందట. రూ. 6.34 లక్షల ప్రారంభ ధర ఉన్న ఈ కారు గనుక కొంటే ఇందులో నుంచి రూ. 50,000 తగ్గుతాయి అన్నమాట.
రెనాల్ట్ కైగర్.. రెనాల్ట్ కైగర్ కారు కొనుగోలు చేయండి ఏకంగా రూ. 65,000వరకు డిస్కౌంట్ పొందండి. ఇందులోనే రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 స్పెషల్ కస్టమర్ లాయల్టీ బోనస్ లు, కార్పొరేట్ బెనిఫిట్స్ రూ. 12,000 లుగా ఉన్నాయి. అయితే 1.0లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ లో లభించే ఈ మోడల్ ఏకంగా 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో అది కూడా డిస్కౌంట్ తో లభిస్తుంది.
రెనాల్డ్ క్విడ్
ఈ మోడల్ కారు మొదటి నుంచే తక్కువ ధరకు లభిస్తుంది. ఇప్పుడు ఈ కారుపై మరో రూ. 50000 తగ్గింది. ఇందులో కూడ క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్స్ వంటివి లభిస్తున్నాయి. రూ. 4.5 లక్షల స్టాటింగ్ ప్రైజ్ ఉండగా.. ఇప్పుడు మరో రూ. 50000 తగ్గింది.
అయితే ఈ కార్లను కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా డీలర్లను సందర్శించండి. ప్రాంతం మారుతున్న సందర్భంలో ఆఫర్ల అవకాశాలు కూడా మారుతాయి. కచ్చితమైన వివరాలు తెలసుకున్న తర్వాత కారు కొనుగోలు చేయడం ఉత్తమం.