Kashmir : జమ్మూకాశ్మీర్ లో పూంచ్, రాజౌళి జిల్లాలో జరుగుతున్న సంఘటనలు ప్రతీ ఒక్కరిని కలవరపరుస్తున్నాయి. నలుగురు సైనికులు చనిపోయారు. అంతకుముందు నెలరోజుల క్రితం కూడా చాలా మంది భారత సైనికులు చనిపోయారు. ఈ సంవత్సరం 15-16 మంది సైనికులు చనిపోయారు.
కశ్మీర్ లోయ ఈరోజు ప్రశాంతంగా ఉంది. సౌత్ కశ్మీర్ లో ఉగ్రవాదం కట్టడిలోకి వచ్చాయి. జమ్మూ ప్రాంతంలోని పూంచ్, రాజౌళి లో ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. దారుణాతి దారుణంగా పరిస్థితులు తయారవుతున్నాయి.
పూంచ్, రాజౌళి పీర్ పంజాల్ దక్షిణాన ఉన్న పర్వతాల ప్రాంతంలో ఉంటాయి. జీలం నది ఇవతల పాకిస్తాన్ కు భూభాగం ఉందో.. అది ఉగ్రవాదులకు అడ్డాగా ఉంది. దట్టమైన అడవులు, గుహలు, పర్వతాలు ఇక్కడ ఉన్నాయి. ఉగ్రవాదులు నెలల తరబడి ఇక్కడ ఉగ్రవాదులు ఉండడానికి అనువుగా ఉన్నాయి. ఈ ప్రత్యేక భౌగోళిక పరిస్థితులున్న ఈ ప్రాంతంలో సైనిక గస్తీ అత్యంత కీలకమైన వ్యవహారం. దొంగచాటు దెబ్బలు తీస్తూ మన సైన్యాన్ని ఉగ్రవాదులు చంపేస్తున్నారు.
ఈ ఎన్ కౌంటర్ తర్వాత.. స్థానికులను పట్టుకొచ్చి విపరీతంగా టార్చర్ పెట్టారని.. కొంతమంది ఆస్పత్రి పాలైనట్టు సమాచారం. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇది జరగకుండా ఉండాల్సింది.. కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అరికట్టాలంటే పార్టీలన్నీ ఒక్కటీ కావాలి..
కాశ్మీర్ పై అన్ని పార్టీలు ఒకటి కావాలని.. అక్కడి పరిస్థితులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.