Discount Offer on Citroen SUV, Citroen
Discount Offer: ఈ నెలలో కారు కొనుగోలు చేయాలని చూస్తున్నారా.. అయితే మీకు ఒక మంచి అవకాశం వచ్చింది.ఫ్రెంచ్ కంపెనీ సిట్రోయెన్ తన కార్లపై భారీ డిస్కౌంట్లను ఇస్తోంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ తన పాత స్టాక్ క్లియర్ చేస్తుంది. ఆరేళ్ల కిందట ఇండియలోకి అడుగుపెట్టిన ఫ్రెంచ్ కార్ల కంపెనీ సిట్రోయెన్ తన కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. 2019లో పీఎస్ఏ గ్రూప్ సీకే బిర్లా గ్రూప్‌తో జాయింట్ వెంచర్‌లో ఇండియాలో సిట్రోయెన్ బ్రాండ్‌ను ప్రారంభించింది. సిట్రోయెన్ ఇండియా C5 ఎయిర్‌క్రాస్ SUV, C3, eC3 లను రూపొందిస్తోంది. ఈ కంపెనీ తన కార్లను అమ్మడానికి బంపర్ ఆఫర్లను అందిస్తోంది. సిట్రోయెన్ కార్లపై సుమారు రెండు లక్షల వరకు తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Also Read : మార్కెట్లోకి రూ.9కోట్ల కారు.. కాకపోతే దీనిని కొంతమందే కొనగలరు
సిట్రోయెన్ కార్లకు పవర్ ఫుల్ ఇంజిన్ అందిస్తోంది. ఈ బ్రాండ్ కారుపై రూ. 1.70 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ఈ ఆఫర్ మార్చి 2025 వరకు సిట్రోయెన్ బసాల్ట్, ఎయిర్‌క్రాస్, C3 , eC3 లపై ఇవ్వబడుతోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ మోడల్ ఇయర్ 2023 మోడల్స్ ఎయిర్‌క్రాస్, C3, eC3 లపై అందిస్తోంది. మరోవైపు, సిట్రోయెన్ బసాల్ట్ ప్రయోజనాలు మోడల్ ఇయర్ 2024 మోడల్‌లో అందుబాటులో ఉన్నాయి.
సిట్రోయెన్ బసాల్ట్ ఒక కూపే SUV. ఈ కారుపై రూ. 1.70 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. బసాల్ట్ చాలా వేరియంట్లు 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తాయి. ఇది 110 hpపవర్, 190 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఇంజిన్‌తో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా అందుబాటులో ఉంది. ఈ సిట్రోయెన్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
సిట్రోయెన్ ఈ కారుపై గరిష్ట ప్రయోజనాలను అందజేస్తుంది. ఈ కారుపై రూ. 1.75 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. ఈ కారు 5-సీటర్ , 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లతో వస్తుంది. సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా వస్తుంది. ఈ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధర రూ.13.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
సిట్రోయెన్ C3 పై రూ.లక్ష వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఇది హ్యాచ్‌బ్యాక్. ఈ కారు చాలా వేరియంట్లలో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ వస్తుంది. టాప్-స్పెక్ వేరియంట్ షైన్ మాత్రమే 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. సిట్రోయెన్ C3 ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.16 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
సిట్రోయెన్ eC3 పూర్తిగా ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. మార్చి 2025 లో ఈ కారుపై రూ. 80 వేల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారులో 29.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. సిట్రోయెన్ కారు ముందు భాగంలో ఒకే మోటారు ఉంది. ఇది 57 hp పవర్ ని ఉత్పత్తి చేస్తుంది.. 143 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని పేర్కొంది.
Also Read : షాకింగ్.. రూ.1000కోట్ల విలువైన మెర్సిడెస్ కొన్న ఇండియన్స్
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Discount offerdiscount of rs 1 5 lakh on citroen suv
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com