Aston Martin : లగ్జరీ స్పోర్ట్స్ కార్స్, గ్రాండ్ టూరర్ కార్లను తయారు చేసే బ్రిటిష్ కార్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ శనివారం భారతదేశంలో కొత్త కారును రిలీజ్ చేసింది. ఆస్టన్ మార్టిన్ 2025 వాన్‌క్విష్‌ను రూ. 8.85 కోట్ల(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది. ఆస్టన్ మార్టిన్ ఆరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వాన్‌క్విష్ మోడల్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 2024లో ప్రపంచవ్యాప్తంగా ఎంట్రీ ఇవ్వనుంది. దీని ప్రత్యేకత ఏంటంటే కేవలం 1000యూనిట్లను మాత్రమే తయారు చేస్తుంది. దీని కారణంగా చాలా సెలెక్టడ్ మెంబర్స్ మాత్రమే దీనిని కొనుగోలు చేయగలుగుతారు.
Also Read : కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన బీఎండబ్ల్యూ.. ఏకంగా ఎన్ని లక్షలు పెంచిందంటే ?
2025 ఆస్టన్ మార్టిన్ వాన్‌క్విష్ గ్లోబల్ డెలివరీలు 2025 ఆఖర్లో ప్రారంభమవుతాయి. దాని స్పెషల్ ప్రొడక్టివిటీ, అద్భుమైన పర్ఫామెన్స్ తో ఇది ఫెరారీ 12సిలిండ్రీ, లంబోర్గిని రెవెల్టో వంటి మార్కెట్‌లోని ఇతర సూపర్ కార్లతో పోటీ పడటానికి సిద్ధంగా ఉంది. ఆస్టన్ మార్టిన్ వాన్‌క్విష్ అనేది జేమ్స్ బాండ్ చిత్రాలలో ముఖ్యంగా 2002 చిత్రం “డై అనదర్ డే”లో V12 వాన్‌క్విష్‌గా అనేక స్పెషల్ ఫీచర్లను కలిగి ఉంటుంది.
s2025 ఆస్టన్ మార్టిన్ వాన్‌క్విష్ 5.2-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V12 పెట్రోల్ ఇంజన్‌తో శక్తిని పొందుతుంది. ఇది 823 bhp పవర్, 1,000 Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 344 కి.మీ. ఇది కేవలం 3.3 సెకన్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది రియల్ వీల్ డ్రైవ్ కారు, దీనిలో 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది.
దీని ఫాసియాలో ఐకానిక్ ఆస్టన్ మార్టిన్ గ్రిల్, టియర్‌డ్రాప్ షేప్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. వాన్క్విష్ DB12, వాంటేజ్ లతో బాండెడ్ అల్యూమినియం బాడీ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. 2025 ఆస్టన్ మార్టిన్ వాన్‌క్విష్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే.. ఇందులో మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్‌లు, కొత్త LED DRLలు, UV సేఫ్టీతో కూడిన బ్యూటిఫుల్ పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. లోపల, క్యాబిన్‌లో పూర్తిగా డిజిటల్ 10.25-ఇంచుల డ్రైవర్ డిస్‌ప్లే, కంప్లీట్ కనెక్టివిటీ ఆఫ్షన్లతో కూడిన 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ప్రీమియం మెటీరియల్స్, అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ గొప్ప డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తాయి.
Also Read : షాకింగ్.. రూ.1000కోట్ల విలువైన మెర్సిడెస్ కొన్న ఇండియన్స్