https://oktelugu.com/

Discount Cars: సమ్మర్ స్పెషల్.. ఈ కార్లపై భారీ డిస్కౌంట్లు..

హ్యుందాయ్ కి చెందిన కోనా ఆల్ ఎలక్ట్రిక్ కారుపై రూ.4 లక్షల తగ్గింపును ప్రకటించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : April 9, 2024 / 11:28 AM IST

    summer sale discount car

    Follow us on

    Discount Cars:  సమ్మర్ సందర్బంగా కొన్ని కార్ల కంపెనీలు భారీ డిస్కౌంట్లతో కార్లను విక్రయిస్తున్నాయి. ఇందులో భాగంగా   ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్  తాజాగా కొన్ని మోడళ్లపై అధిక ప్రయోజనాలను అందించనున్నట్లు ప్రకటించింది . కొన్ని కార్లపై వివిధ రకాలుగా రూ.30,000 నుంచి రూ. 4 లక్షల వరకు ప్రయోజనాలను అందించనుంది. ఏ కార్లపై ఎలాంటి డిస్కౌంట్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం..

    హ్యుందాయ్ కంపెనీకి చెందిన హ్యాచ్ బ్యాక్ కారు ఐ 20 ప్రీమియం పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఇది 1.2 లీటర్ నేచురల్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ 83 బీహెచ్ పీ పవర్ తో పాటు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉన్న ఈ మోడల్ పై రూ.25,000 ప్రయోజనాలను కల్పిస్తోంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ పై రూ.10,000 మాత్రమే ఎక్చేంజ్ బోనస్ అందిస్తుంది. మొత్తంగా ఈ మోడల్ పై రూ.35, 000 వరకు తగ్గింపును ప్రకటించింది.

    కాంపాక్ట్ ఎస్ యూవీ వెన్యూ బెస్ట్ సేల్స్ కారుగా నిలిచింది. వెన్యూ 1.2 లీటర్ ఎంపీఐ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో, 1.5 లీటర్ డీజిల్ అనే మూడు ఇంజిన్లను కలిగి ఉంది. దీనిని రూ.7.94 లక్షల నుంచి రూ.13.48 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ కారుపై పెట్రోల్ వేరియంట్ పై రూ.30,000 ఆఫర్ ఉంది. టర్బో డీసీటీ ఆటోమేటిక్ కారు కోసం రూ.25,000 డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఇవే కాకుండా 1.2 లీటర్ మాన్యువల్ మోడల్ పై రూ.20,000 తగ్గింపును ప్రకటించింది.

    పెట్రోల్, డీజిల్ వేరియంట్లు మాత్రమే కాకుండా ఈవీల్లోనూ తన సత్తా చాటేందుకు హ్యుందాయ్ రెడీ అవతోంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ కాబోతున్నకోనా ఆల్ ఎలక్ట్రిక్ కారుపై రూ.4 లక్షల తగ్గింపును ప్రకటించారు. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 452 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అయితే ఆఫర్లు, డిస్కౌంట్లు ఆయా ప్రాంతాలను బట్టి ఉంటాయి. అందువల్ల డిస్కౌంట్లపై కార్లు పొందాలనుకునేవారు సమీప ప్రాంతాల్లోని డీలర్లను సంప్రదించిన తరువాత ధర డిసైడ్ కావాల్సి ఉంటుంది.