Electric vehicle : దసరా పండుగ సందర్భంగా కొన్ని కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. చాలా వరకు పండుగ సీజన్లో తమ సేల్స్ ను పెంచుకునేందుకు వివిధ వస్తువులను అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. అయితే ఆటోమోబైల్ రంగానికి చెందిన వాహనాల కంపెనీలు పండగుల సీజన్లో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తాయి. కొన్ని కంపెనీలు తక్కువ ధరకే వాహనాలను విక్రయిస్తుంటాయి. తాజాగా ప్రముఖ స్కూటర్ల కంపెనీ ‘ఓలా’ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. తమ కంపెనీకి చెందిన ఓ స్కూటర్ ను తక్కువ ధరకే అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్న వారికి ఇది ప్రయోజనం కలగనుందని అంటున్నారు. ఇంతకీ ఓలా కంపెనీ ప్రకటించిన ఆ స్కూటర్ ఏదీ? దాని ధర ఎంత?
ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకురావడంలో ఓలా కంపెనీ ముందు ఉంటోంది. ఇప్పటికే S1 విభాగంలో పలు స్కూటర్లను విక్రయిస్తోంది. వీటిలో S1 Pro, S1 Air, S1 X ఉన్నాయి. వీటి ధరలు వరుసగా 74,900, రూ.87,999, రూ.1.01 లక్షలతో విక్రయిస్తున్నారు. కొన్ని మిగతా కంపెనీలు విద్యుత్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి రూ. లక్షకు పైగానే ధరలతో ఉన్నాయి. కానీ తాజాగా ఓలా కంపెనీ అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. ఈ కంపెనీ తయారు చేసిన S1 X స్కూటర్ ను రూ.49,999 కే విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి దీని ధర రూ. 1.01 లక్షలు ఉంది.
ఈ స్కూటర్ ను తక్కువ ధరకు ఇవ్వడమే కాకుండా పలు ప్రయోజనాలను కల్పిస్తోంది. వీటిలో హైపర్ ఛార్జింగ్, యాక్సెసరీస్ డీల్స్ వంటి మొత్తం రూ. 40 వేల విలువైన ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం పండుగల సీజన్ సందర్భంగా ఈ ఆఫర్ ను ఇస్తున్నట్లు తెలిపారు. ఓలా S1 X ఫీచర్లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇది 2 కిలో వాట్ బ్యాటరీని కలిగి ఉంది. దీనిపై రూ.25 వేల ప్లాట్ డిస్కౌంట్, రూ.15 వేల నగదు డిస్కౌంట్లు ఇవ్వనున్నారు. అలాగే 80 వేల కిలోమీటర్ల వరకు లేదా 8 ఏళ్ల పాటు బ్యాటరీ వారెంట్ ఇవ్వనున్నారు. ఓలా S1 X ను నేరుగా కాకుండా క్రెడిట్ కార్డుపై కొనాలని అనుకుంటే ఈఎంఐలపై రూ.5 వేల వరకు తగ్గింపు ప్రకటిస్తారు. అలాగే రూ. 6 వే
ల ఓఎస్, రూ.7 వేల విలువైన హైపర్ ఛార్జింగ్ క్రెడిట్స్ ఉచితంగా అందించనున్నారు.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా పెరిగపోతుంది. అయితే వీటి ధరలు అందుబాటులో ఉండడం లేదు. ఇలాంటి సమయంలో లో బడ్జెట్ లో ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అని అంటున్నారు. అంతేకాకుండా ఓలా లాంటి ప్రముఖ కంపెనీతో పాటు మంచి ఫీచర్స్ కలిగిన S1 X ను రూ. 49,999లకే విక్రయించడంతో చాలా మంది దీనిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.అయితే ఈ స్టాక్ లిమిటెడ్ మాత్రమేనని, అవి ఉన్నంత వరకే కొనుగోలు చేయాలని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.