Women’s T20 World Cup 2024: గ్రూప్ – ఏ లో భాగంగా టీమిండియా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. శుక్రవారం న్యూజిలాండ్ జట్టుతో జరిగే మ్యాచ్ లో తలపడనుంది అయితే టీమిండియాలో సీనియర్ ఆటగాళ్లు రాణించాల్సిన అవసరం ఏర్పడుతోంది. అప్పుడే భారత జట్టు తన కప్పు కలను నెరవేర్చుకోగలదు. భారత జట్టు ప్రతి టోర్నీలోనూ దుర్భేద్యంగా కనిపిస్తోంది. కానీ కీలక సమయాలలో జట్టు విఫలమవుతోంది. అందువల్ల ఈసారి జట్టు క్లిష్ట సమయాలలో సమిష్టిగా రాణించాల్సి ఉంది.. ఈ నేపథ్యంలోనే జట్టులో మానసిక ధైర్యాన్ని పెంచేందుకు నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే వీటిని ఎంతవరకు టీమిండియా క్రీడాకారిణులు అమల్లో పెడతారో వేచి చూడాల్సి ఉంది. ఇక న్యూజిలాండ్ జట్టుతో జరిగే పోటీలో హర్మన్, స్మృతి, జెమీమా, షఫాలి, దీప్తి శర్మ బ్యాటింగ్ లో అదరగొట్టాల్సి ఉంది. అయితే షఫాలి, దీప్తి ఫామ్ లో ఉన్నారు. కథ చివరి 5 t20 లలో స్మృతి ఐదు హాఫ్ సెంచరీలు చేసింది.. అయితే యూఏఈ మైదానాలపై విపరీతమైన వేడి ఉంటుంది. అలాంటి మైదానాలపై పరుగులు తీయడం అంత సులువైన విషయం కాదు.
యూఏఈ మైదానాలు మందకొడిగా ఉంటాయి. వాటిపై స్పిన్నర్లు దీప్తి శర్మ శ్రేయంక యాదవ్ సత్తా చాటుతారని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ కనుక వారు అద్భుతంగా బౌలింగ్ చేస్తే టీమిండియాకు తిరుగు ఉండదు. ఇక న్యూజిలాండ్ జట్టు కొత్త, పాత ఆటగాళ్లతో కనిపిస్తోంది. సోఫీ డివైన్ న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తోంది. సుజి కీలకమైన ఆల్ రౌండర్ గా ఉంది. లియా, లీగ్ వంటి ఆటగాళ్లు న్యూజిలాండ్ జట్టుకు అదనపు బలం. ఈ రెండు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో.. పోటీ హోరా హోరీగా ఉంటుందని తెలుస్తోంది. సాయంత్రం 7:30 నుంచి ఈ మ్యాచ్ మొదలవుతుంది. గూగుల్ ప్రీ డిక్షన్ ప్రకారం భారత జట్టు గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. భారత జట్టులో చాలామంది క్రీడాకారిణులకు యూఏఈ మైదానాలపై ఆడిన అనుభవం ఉంది. అందువల్ల వారు సత్తా చాటుతారని అందరూ భావిస్తున్నారు.
భారత జట్టు
హర్మన్ (కెప్టెన్), స్మృతి, షఫాలి, దీప్తి శర్మ, జెమీమా, రిచా, యాస్తిక, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, హేమలత, ఆశ, రాధా, శ్రేయాంక, సజన, రేణుకా సింగ్.
న్యూజిలాండ్
సోఫీ డివైన్(కెప్టెన్), సుజి, అమీలియా, కార్సన్, ఇస బెల్లా, లియా, మ్యాడీ గ్రీన్, బ్రూక్, ఫ్రాన్, లీ కాస్పెరెక్, జాస్ కెర్, రోస్ మేరి, మోలీ పెన్ ఫోల్డ్, జార్జియా, హనా రో.
లైవ్ టెలికాస్ట్: ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఛానల్.. స్టార్ స్పోర్ట్స్.