వాట్సాప్ కు దూరంగా ఉండమని చెబుతున్న కంపెనీలు.. ఎందుకంటే..?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు మల్టీ నేషనల్ కంపెనీలు భారీ షాక్ ఇస్తున్నాయి. బిజినెస్ కాల్స్ చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోను వాట్సాప్ ను ఉపయోగించవద్దని చెబుతున్నాయి. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీలను, సర్వీస్ నిబంధనలను తెస్తున్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఉద్యోగులను వాట్సాప్ కు దూరంగా ఉండమని సూచనలు చేస్తున్నాయి. వాట్సాప్ పేరెంట్ కంపెనీ ఫేస్ బుక్ తో డేటా షేర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని భావించి కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. Also Read: […]

Written By: Kusuma Aggunna, Updated On : January 12, 2021 10:50 am
Follow us on

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు మల్టీ నేషనల్ కంపెనీలు భారీ షాక్ ఇస్తున్నాయి. బిజినెస్ కాల్స్ చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోను వాట్సాప్ ను ఉపయోగించవద్దని చెబుతున్నాయి. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీలను, సర్వీస్ నిబంధనలను తెస్తున్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఉద్యోగులను వాట్సాప్ కు దూరంగా ఉండమని సూచనలు చేస్తున్నాయి. వాట్సాప్ పేరెంట్ కంపెనీ ఫేస్ బుక్ తో డేటా షేర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని భావించి కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

Also Read: అమెజాన్ కస్టమర్లకు శుభవార్త.. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..?

సైబర్ నిపుణులు సైతం ఉద్యోగులకు కంపెనీలు వాట్సాప్ కు దూరంగా ఉండాలని సూచించాలని చెబుతున్నాయి. ఒక ప్రముఖ కంపెనీ తమ ఉద్యోగులను కార్పొరేట్ విషయాల గురించి, బిజినెస్ మీటింగ్ ల గురించి వాట్సాప్ ద్వారా వివరాలను పంచుకోవద్దని సూచనలు చేసింది. వాట్సాప్ కొత్త నిబంధనల వల్ల చాట్స్ లో ఉన్న మెసేజ్ లు కంపెనీలు కావాలన్నా దొరకవు. మెసేజ్ లు ఎన్‌క్రిప్ట్ అయి ఉండటం వల్ల మెసేజ్ లను ఇతరులు చూసే అవకాశం ఉండదు.

Also Read: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే..?

యూరోపియన్ రీజియన్‌లో వాట్సాప్ యూజర్ల డేటాను యాడ్ ల కోసం వాడుకోకపోవడంతో పాటు ఫేస్ బుక్ కు ఎలాంటి డేటాను షేర్ చేసుకోలేదు. వాట్సాప్ కొత్త అప్ డేట్ లో ఎన్నో ఫీచర్లు యాడ్ అయ్యాయి. ఆ ఫీచర్లలో ఫేస్ బుక్ హోస్టెడ్ చేసినవి కూడా ఉన్నాయి. అయితే వాట్సాప్ నుంచి స్పష్టత వస్తే మాత్రమే యూజర్లలో నెలకొన్న అనుమానాలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మరిన్ని వార్తల కోసం: వ్యాపారము

మరోవైపు వాట్సాప్ గ్రూపులు ఆన్ లైన్ నుంచి యూజర్లు ఎంటర్ అయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. గతంలో ఇలాంటి బగ్ వెలుగులోకి రాగా వాట్సాప్ ఆ సమస్యను ఫిక్స్ చేసింది. అయితే మళ్లీ ఇలాంటి సమస్య రావడంతో వాట్సాప్ యూజర్లు టెన్షన్ పడుతున్నారు.