Auto Expo: 2025 కొత్త ఏడాది సందర్భంగా జనవరి 17 నుంచి న్యూఢిల్లీలో Auto Expo నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యాసింజర్ వాహనాలతో పాటు కమర్షియల్ వెహికల్స్ ను ప్రదర్శించారు. దేశ, విదేశాల నుంచిప్రతినిధులు వచ్చిన ఈ కార్యక్రమంలో కొన్ని గూడ్స్ వెహికల్స్ అలరించాయి. అంతేకాకుండా ఇవి ఎలక్ట్రిక్ వేరియంట్ కావడంతో ఆకర్షణీయంగా మారాయి. వీటిలో Eviator, Super Cargo వాహనాల గురించి ప్రత్యేకంగా నిలిచాయి. వీటిని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ఆవిష్కరించారు. స్టాండెడ్ బ్యాటరీలను కలిగి ఉన్న ఈ వాహనాల సామర్థ్యం ఏంటో తెలుసుకుందాం..
ఆటో మొబలిటీ షో అనగానే చాలా మంది ప్యాసింజర్ వాహనాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. కానీ ఈసారి గూడ్స్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వేరియంట్లో ప్రదర్శించారు. ఇవి దేశంలోనే ట్రూ ఈవీలు కావడం విశేషం. అంతేకాకుండా సర్టిఫైడ్ రేంజ్ తో పాటు కటింగ్ ఎడ్జ్ డిజైన్ ను కలిగి ఉన్నాయి. SUV వేరియంట్ లో ఉన్న ఈ వెహికల్స్ లో అడ్వాన్స్ డ్ టెలిమేటిక్స్ ఉన్నాయి. వీటిలో Eviator 3.5 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఇందులో 80 కిలో వాట్ పవర్ ను కలిగి ఉంటుంది. ఇది 300 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిపై 245 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే దీనిని రూ.15.99 లక్షల ధరతో విక్రయిస్తున్నారు.
Super Cargo విషయానికొస్తే 1.2 టన్నుల బరువును కలిగి ఉంటుంది. 200 కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. పరిశ్రమలకు అనుగుణంగా ఉండే ఈ వెహికల్ 3 వీలర్ తో కలిగి ఉంది. రోజువారి వినియోగానికి అనుగుణంగా ఉండే విధంగా దీనిని డిజైన్ చేవారు. మెంట్రా సంస్థకు చెందిన సూపర్ కార్గో బ్యాటరీ ఛార్జింగ్ కావడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఈ వెహికల్ లో డ్రైవర్ సీట్ బెల్ట్ తో పాటు ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, ఎక్కువ స్పేస్ కలిగిన వంటి ఫీచర్లు ఉన్నాయి. బీటూబీ వినియోగదారులకు ఈ వెహికల్ కన్వినెంట్ గా ఉంటుందని అంటున్నారు. సూపర్ కార్గోను రూ.4.37 లక్షలుగా ధర నిర్ణయించారు. చిన్న వాహనంగా కనిపించినా చిరు వ్యాపారులకు ఇది అనుగుణంగా ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా ధర తక్కువగా ఉండడంతో చాలా మంది దీనిపై ఆసక్తి చూపే అవకాశం ఉందని అంటున్నారు.
మెంట్రా సంస్థ చెబుతున్న ప్రకారం.. కార్గో ప్లేట్ ఆపరేటర్స్ తో పాటు వివిధ సదుపాయాలను కలిగి ఉంది. అయితే ఇప్పటికే మార్కెట్లో ఉన్న వాటికి పోటీ ఇచ్చే అవకాశం ఉందని ఉంటున్నారు. వీటితో పాటు హెవీ వెహికల్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ప్యాసింజర్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చాయి. ఇప్పుడు కమర్షియల్ వెహికల్స్ కూడా ఎలక్ట్రిక్ వేరియంట్ లో రావడంతో భవిష్యత్ లో కర్బన ఉద్ఘారాలు లేని విధంగా చూసే అవకాశం ఉందని అంటున్నారు.