Pawan Kalyan: గత వారం రోజుల నుండి అధికార పార్టీ కి సంబంధించిన మీడియా లో లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. దీని పై ప్రతీరోజు చర్చలు,డిబేట్స్ జరుగుతూనే ఉన్నాయి. లోకేష్ తెలుగు దేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడని, ఆ పార్టీ నేడు గెలిచి అధికారం లోకి రావడానికి ఆయన ఎంతో కృషి చేసాడని, ఈ క్రమంలో ఆయన ఎన్నో కష్టాలు, అవమానాలు కూడా ఎదురుకున్నాడు అంటూ కథనాలు ప్రచారం చేసారు. సోషల్ మీడియా లో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ధీటుగా సమాధానం చెప్తూ, లోకేష్ ని ఉప ముఖ్యమంత్రి ని చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా ప్రకటించాలి అంటూ డిమాండ్ చేసారు.
ఇలా సోషల్ మీడియా లో ఇరు పక్షాల మధ్య పెద్ద ఎత్తున వాదనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంతలోపే నేడు జరిగిన ఒక అనూహ్య పరిణామం టీడీపీ పార్టీ అభిమానులకు మింగుడు పడనివ్వకుండా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నేడు NDRF ట్రైనింగ్ సెంటర్ ని ప్రారంభించేందుకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మన ఆంధ్ర ప్రదేశ్ కి విచ్చేశాడు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. అయితే ఆవిష్కరణ శిలా ఫలకం వద్ద కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా లకు మాత్రమే కుర్చీలు వేశారు. ఇది గమనించిన అమిత్ షా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా మరో కుర్చీ ని తెచ్చి పవన్ కళ్యాణ్ ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు.
దీనిని సోషల్ మీడియా లో అభిమానులు షేర్ చేస్తూ ఇది పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి పవర్. కేంద్ర స్థాయిలో ఆయనకీ ఆ రేంజ్ గుర్తింపు ఉంది. వాళ్ళు బలంగా అనుకుంటే ఆయన్ని ముఖ్యమంత్రి ని కూడా చేయగలరు. కూటమి లో ఇలాంటి వాదనల కారణంగానే విడిపోయే పరిస్థితి వస్తుందని, పవన్ కళ్యాణ్ కూటమి నుండి వైదొలగితే టీడీపీ పర్టిస్టితి ఏమి అవుతుందో ఊహించడానికి కూడా కష్టమేనని, కాబట్టి రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న ఈ కీలక సమయంలో అందరూ అభివృద్ధి కోసం కొట్లాడాలి కానీ, పదవుల కోసం కాదని, ఒకప్పుడు డిప్యూటీ సీఎం పదవి కి అసలు విలువే ఉండేది కాదని, కేవలం పవన్ కళ్యాణ్ కారణంగానే ఆ పదవి కి విలువ వచ్చిందని, కాబట్టి లోకేష్ కూడా తాను పని చేస్తున్న శాఖ ద్వారానే విలువ అలాంటి విలువ సంపాదించుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ @AmitShah గారు గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి ప్రత్యేకంగా కుర్చీ వేయాలని ఆదేశించడం
NDA Top Leaders know the importance and capability of Pawan Kalyan garu.#NDRFRaisingDay pic.twitter.com/5uydaXS2Kc
— శ్రీ రామ్ (@JSPSriram) January 19, 2025