CNG Automatic Car : CNGల్లో ఆటోమేటిక్ గేర్ బాక్స్.. ఈ కార్లలో మాత్రమే ఉన్నాయి.. అవేంటంటే?

రెండు కార్లలో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను అమర్చారు. కేవలం ఆ రెండు కార్లలో మాత్రమే ఈ సౌకర్యం ఉండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?

Written By: Chai Muchhata, Updated On : February 9, 2024 1:11 pm

Best 7 CNG Cars

Follow us on

CNG Automatic Car :  సౌకర్యవంతమైన కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. రోజూవారీ అవసరాలతో పాటు దూరపు ప్రయాణాలు చేయాలనుకునే వారు కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారు. ఈ తరుణంలో ఫీచర్స్ తో పాటు స్పెషిఫికేషన్స్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అయితే పెట్రోల్ వేరియంట్ కంటే CNGలను ఎక్కువగా కోరుకుంటారు. కానీ వీటిల్లో ఇప్పటి వరకు మాన్యువల్ గేర్ బాక్స్ ను మాత్రమే కలిగి ఉన్నాయి. తాజాగా రెండు కార్లలో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను అమర్చారు. కేవలం ఆ రెండు కార్లలో మాత్రమే ఈ సౌకర్యం ఉండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?

టాటా కంపెనీ కార్ల ఉత్పత్తిలో దూసుకుపోతుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఎన్నో మోడళ్లు ఆకర్షించాయి. టాటా నుంచి టిగోర్ ఫేమస్ అయిన విషయం తెలిసిందే. 1.2 లీటర్ 3 సిలిడర్ నేచురల్ అస్పిరేటెడ్ ఇంజిన్ కలిగిన ఇది 86 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే కారు CNG వేరియంట్ లో 73 బీహెచ్ పీ పవర్, 95 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. టిగోర్ లో ఇప్పటి వరకు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ మాత్రమే ఉండేది. కానీ కొత్తగా ఆటోమేటిక్ గేర్ బాక్స్ (AMT)ని అమర్చారు.

టాటా టియాగోలో కూడా సేమ్ ఫీచర్స్, స్పెషిపికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కార్లలో ఏఎంటీని అమర్చడంతో మరింత సౌకర్యంగా మారింది.సీఎన్ జీ ఆటోమేటిక్ గేర్ ద్వారా లీటర్ పెట్రోల్ కు 28.06 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. ఈ సౌకర్యం ద్వారా రెండు కార్ల సేల్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని టాటా మోటార్స్ చీఫ్ కమర్సియల్ ఆఫీసర్ అమిత్ కామత్ అన్నారు. ఇక ఇందులో ట్విన్ సిలిండర్ టెక్నాలజీ, డైరెక్ట్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.