https://oktelugu.com/

Suma Kanakala: బ్రహ్మాజీని కూడా లాగి.. కుమారీ ఆంటీని సాంతం వాడేసిన యాంకర్ సుమా .. ..

రీసెంట్ గా కుమారీ ఆంటీ ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ఫుడ్ స్టాల్ పెట్టి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది.

Written By:
  • Dharma
  • , Updated On : February 9, 2024 / 01:28 PM IST

    Suma Kanakala

    Follow us on

    Suma Kanakala: ఒకప్పుడు సెలబ్రెటీస్ తో ఫోటోలు దిగి ఫేమస్ అయిపోవాలి. వాళ్లతో రీల్స్ చేసి సెలబ్రెటీస్ అయిపోవాలి అని చాలా మంది ఎదురుచూసేవారు. కానీ కాలం మారినట్టుంది. కాస్త సెలబ్రెటీ హోదా వస్తే చాలు వారిని వాడుకుంటున్నారు స్టార్ స్టేటస్ ఉన్నవారు. కాస్త విడమర్చి చెబితే.. రీసెంట్ గా కుర్చీ తాత సాంగ్ గుంటూరు కారం సినిమాలో చూశారు కదా.. ఈ ఒక్క పదంతో పాటనే వచ్చింది. ఇలా మహేష్ బాబు వంటి స్టార్ హీరో సినిమాలో ఆ పాట రావడం గమనార్హం అంటూ కామెంట్లు చేశారు చాలా మంది.

    ఇక రీసెంట్ గా కుమారీ ఆంటీ ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ఫుడ్ స్టాల్ పెట్టి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. ఏకంగా రేవంత్ రెడ్డి ఈమె ఫుడ్ బిజినెస్ ను రన్ చేసుకునేలా ఆర్డర్స్ వేశారు అంటే ఆమె ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రీసెంట్ గా ఈమె కస్టమర్లతో మాట్లాడుతున్న డైలాగులకు సుమ తన దైన స్టైల్ లో వీడియోను చేసి నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    ఇక ఈ రీల్ చూసిన దర్శకుడు సుకుమార్ సతీమణి తజిత స్మైల్ ఎమోజీలతో కామెంట్ చేశారు. అయితే నెటిజన్లు మాత్రం బ్రహ్మాజీ రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక బ్రహ్మాజీ సోషల్ మీడియాలో చాలా హుషారుగా, యాక్టివ్ గా ఉంటారు. ఆయన చేసే ట్వీట్స్ కి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రతి విషయాన్ని చాలా కామిక్ గా ట్వీట్ చేసే బ్రహ్మాజీ.. ఇప్పుడు సుమ తనపై చేసిన వీడియో పై ఎలా స్పందిస్తారో అని ఎదురుచూస్తున్నారు నెటిజన్లు. మరి బ్రహ్మాజీ రియాక్షన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

    అయితే రీసెంట్ గా కుమారీ ఆంటీ బిగ్ బాస్ ఉత్సవంలో కనిపించినట్టు ఓ చిన్నవీడియో వచ్చింది. దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతుందట. అయితే చిన్న ఫుడ్ స్టాల్ తో తన ప్రయాణం మొదలు పెట్టిన ఈ ఆంటీ ప్రస్తుతం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే రేంజ్ కు వెళ్లిందంటే ఆమె కష్టాన్ని కొనియాడాల్సిందే అంటున్నారు నెటిజన్లు.