Jio Phone: జియో మరోసారి మార్కెట్ ను కుదిపేయబోతోందా? ఇక ఆ ఫోన్ల కథ కంచికే?

Jio Phone: టెలీకమ్యునికేషన్ రంగంలో అంతలా ఎదిగిన జియో ప్రైమరీ మోడల్ ఫోన్లను రిలీజ్ చేసింది. వీటితో చాలా వరకు దెబ్బతిన్నది. కంపెనీ ఆలోచన బాగానే ఉన్నా..

Written By: Neelambaram, Updated On : May 27, 2024 4:35 pm

Jio Phone 5G

Follow us on

Jio Phone: భారత్ లో టెలికాం రంగంలో విప్లవానికి నాంది పలికింది ‘జియో’. రిలయన్స్(Reliance) నుంచి విడిపోయి ఏర్పడిన జియో తక్కువ రేటుతో మంచి టారీఫ్ లను అందించింది. దీంతో అప్పటి వరకు మార్కెట్లను ఏలుతున్న ఎయిర్ టెల్, ఐడియా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు చతికిల పడ్డాయి. సగటు స్మార్ట్ ఫోన్(SmartPhone) దారుడు కూడా గతంలో ఎయిర్ టెల్(Airtel), ఐడియా(Idea) లాంటివి ఎంత మేర దోచుకున్నాయో పోల్చుకొని ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటికీ భారత్ లో అత్యధిక మంది టెలికాం యూజర్లు కలిగిన ఉన్న నెట్ వర్క్ జియోనే.

టెలీకమ్యునికేషన్ రంగంలో అంతలా ఎదిగిన జియో ప్రైమరీ మోడల్ ఫోన్లను రిలీజ్ చేసింది. వీటితో చాలా వరకు దెబ్బతిన్నది. కంపెనీ ఆలోచన బాగానే ఉన్నా.. ప్రైమరీ మోడల్ ను ఎవరూ అంతగా ఇష్టపడకపోవడంతో మొబైల్ తయారీ రంగంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే, దాన్ని అధిగమించేందుకు ఇప్పుడు మరో కాన్సెప్ట్ తో వస్తుంది. అదే.. స్మార్ట్ ఫోన్ తో..

అధిక రేటుకు 5G బిడ్ ను సొంతం చేసుకుంది జియో. 5G మొదట్లో పెద్ద పట్టాణాలైన ముంబై, బెంగళూర్, హైదరాబాద్, తదితర వాటిల్లో ప్రయోగాలు చేసి సక్సెస్ అయిన తర్వాత 5Gని విస్తరించింది. ప్రస్తుతం 5G నెట్ వర్క్ చాలా వరకు పల్లెలకు కూడా విస్తరించింది. దీంతో కామన్ గానే ప్రతీ ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చింది.

బేసిక్ ఫోన్ లో ఇబ్బందులు పడ్డ జియో ఇప్పుడు 5G స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతుంది. ఈ ఫోన్ కు సంబంధించి స్పెసిఫికేషన్ ను ఇటీవల రిలీజ్ చేసింది. ప్రతీ ఒక్కరిని ఆకట్టుకునేలా ఉన్న ఈ ఫోన్లు.. మార్కెట్ ను శాసిస్తాయని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

6.50 అంగుళాల టచ్‌ స్క్రీన్ డిస్‌ప్లేతో 720×1600 పిక్సెల్‌ (HD+) రిజెల్యూషన్‌తో రాబోతుంది. జియో 5G ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్)తో నడుస్తుంది. 5000mAh బ్యాటరీని ఇందులో అమర్చారు. కెమెరాల విషయానికొస్తే, 5G 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ రేర్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం 8మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. 32 GB ఇన్ బిల్డ్ మెమోరీ ఉంటుంది. మైక్రో SD కార్డ్ ద్వారా మరింత పెంచుకునే వీలు కల్పించారు. Wi-Fi 802.11 a/b/g/n, GPS, బ్లూటూత్ v5.10, USB టైప్-C ఉన్నాయి.

WhatsApp: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. ఇకపై ఆ ఇబ్బంది ఉండదు

Deepfake Image: ‘డీప్‌ఫేక్‌’ టెన్షన్‌.. ఇలా చెక్‌ పెడదాం