https://oktelugu.com/

Gold: బంగారం కొనేముందు ఈ మూడు విషయాలు చెక్‌ చేసుకోండి

బంగారం కొనే ముందు ఈ మూడు విషయాలు చూసుకోవాలి. మనం కొన్న బంగారం వివరాలన్నీ మనకు ఇచ్చే బిల్లుపై మెన్షన్‌ చేశారా లేదా అని చెక్‌ చేసుకోవాలి. మనకు 22 క్యారెట్ల బంగారం అని ఇచ్చినప్పుడు ఆ విషయాన్ని కూడా బిల్‌పై ఉండే చూసుకోవాలి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 4, 2024 5:19 pm
    Gold Prices

    Gold Prices

    Follow us on

    Gold: బంగారం.. రోజురోజుకూ విలువ పెరుగుతున్న వస్తువు ఇదే. మహిళలు ఎక్కువగా ఇష్టపడేది బంగారమే. ఇక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే.. బంగా కచ్చింతంగా ఉండాల్సిందే. అయితే సేఫ్టీ పెట్టుబడుల కోసం చూసేవారు ఇప్పుడు భూమి, బంగారంపైనే పెట్టుబడి పెడుతున్నారు. భూమిపై పెట్టుబడి లాభం ఎక్కువగా ఉన్నా.. రిస్క్‌ కూడా ఉంటుంది. కానీ ఎలాంటి రిస్క్‌ లేని పెట్టుబడి బంగార కొనడం. కొని ఉంచితే దాని ధర పెరుగుతూ పోతుంది.

    బంగారం కొనడమూ ఓ కళ..
    అయితే బంగార కొనడానికి అందరూ షాప్‌లకు వెళ్తుంటారు. ఇప్పుడు జ్యువెల్లరీ స్టోర్స్‌ కూడా వెలుస్తున్నాయి. అయితే మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. ఇప్పటికీ చాలా మంది బంగారం కొనే విషయంలో మోసపోతూనే ఉన్నారు. 22 క్యారెట్‌ అని చెప్పి చాలా షాపులు మనకు 18 క్యారెట్ల బంగారం మాత్రమే అమ్ముతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే జరుగుతోంది. మన నుంచి 22 క్యారెట్ల బంగారానికి డబ్బులు తీసుకుని 18 క్యారెట్ల బంగారమే ఇస్తున్నారు.

    ఈ మూడు చూసుకోవాలి..
    బంగారం కొనే ముందు ఈ మూడు విషయాలు చూసుకోవాలి. మనం కొన్న బంగారం వివరాలన్నీ మనకు ఇచ్చే బిల్లుపై మెన్షన్‌ చేశారా లేదా అని చెక్‌ చేసుకోవాలి. మనకు 22 క్యారెట్ల బంగారం అని ఇచ్చినప్పుడు ఆ విషయాన్ని కూడా బిల్‌పై ఉండే చూసుకోవాలి. ఇక బంగారు ఆభరణంపై ప్యూరిటీని కూడా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఏదైనా తేడా వస్తే మనం ఫైట్‌ చేసే వకాశం ఉంటుంది.

    = బంగారంపై బీఏఎస్‌ హాల్‌మార్క్, ప్యూరిటీ నంబర్‌ 21కె96 అని ఉండాలి. అది లేకుంటే మనం కొనే బెంగారం నాణ్యత తక్కువగా ఉన్నట్లు గుర్తించాలి. 22కె96 అంటే 22 క్యారెట్లు. 91.6 ప్యూరిటీ అని అర్థం.

    = హెచ్‌యూఐడీ నంబర్‌ కూడా ఉండాలి ఇది 6 అంకెల్లో ఉంటుంది. బీఏఎస్‌ కేర్‌ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని ఆరు అంకెల నంబర్‌ ఎంటర్‌ చేయగానే బంగారం వివరాలు వస్తాయి. ఈ మూడు చూసుకున్న తర్వాతనే బంగారం కొనడం ద్వారా మన నష్టపోకుండా ఉంటాం.