Water Heater: ప్రతి మనిషి ఆరోగ్య లక్షణాల్లో ప్రతి రోజూ స్నానం చేయడం. ఈ స్నానంను వేడినీళ్లతో చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామాల్లో ఉండేవారు వేడినీళ్ల స్నానం సాధ్యమవుతుంది. కానీ పట్టణాలు, నగరాల్లో ఉండేవారు మాత్రం వేడినీళ్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. మిడిల్ క్లాస్ పీపుల్స్ వేడినీళ్ల స్నానం కోసం ఎక్కువగా వాటర్ హీటర్ వాడుతూ ఉంటారు. తక్కువ ఖర్చుతో విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా అవసరం లేనందున చాలా మంది వాటర్ హీటర్ కు ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. అయితే వాటర్ హీటర్ వాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువ. వాటర్ హీటర్ వాడే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..
వాటర్ హీటర్ వాడే వారు ప్లాస్టిక్ బకెట్ ను మాత్రమే ఉపయోగించాలి. ఇనుము, లేదా లోహపు వస్తువులను ఉపయోగించడం వల్ల అత్యధిక విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంది. దీంతో ఆ పాత్రలను తాకినా కరెంట్ షాక్ వస్తుంది. వాటర్ హీటర్ వాడే ముందు దానిని నీటిలోపలికి ఎంత వరకు వేయాలో దానిపై ఉంటుంది.దాని ప్రకారంలో నీటిలో ఉంచాలి. లేకుంటే వాటర్ హీటర్ తొందరగా పాడవుతుంది. వాటర్ హీటర్ తో నీటిని వేడి చేయడం వల్ల నీటిలో ఉండే ఉప్పు హీటర్ కు పట్టుకుంటుంది. దీనిని క్లీన్ చేయడం వల్ల తొందరగా నీరు వేడి అయ్యే అవకాశాలు ఉంటాయి.
చిన్న పిల్లలు ఉండే ఇళ్లల్లో వాటర్ హీటర్ వాడకపోవడమే మంచిది. లేదా వాటర్ హీటర్ వాడుతున్న పాత్రల వైపు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ హీటర్ ను ఎక్కువగా కాలం ఉపయోగించకపోవడమే మంచిది. కనీసం రెండు సంవత్సరాలు పూర్తయిన తరువాత కొత్తది కొనుగోలు చేయాలి. లేకుంటే పాత హీటర్ లో చిన్న చిన్న సమస్యలు ఏర్పడి షార్ట్ సర్క్యూట్ ఏర్పడే అవకాశం ఉంది. ప్లాస్టిక్ బకెట్ లో వాటర్ హీటర్ పెట్టడం వల్ల వేడికి బకెట్ కరిగిపోయే అవకాశం ఉంది. అయితే ఒక చెక్కను పెట్టి దాని సహాయంతో వేడి చేసుకోవడం ఉత్తమం.