Best 7 seater cars at lowest price: భారతదేశంలో కార్లు కొనే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు బడ్జెట్లో చిన్న కారు కొనుగోలు చేస్తే చాలు అని అనుకునేవారు.. ఇప్పుడు సౌకర్యవంతంగా విశాలంగా ఉండే కార్లు కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో 7 సీటర్ కారు అయితే బెటర్ అని ఆలోచిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల సెవెన్ సీటర్ కార్లు ఉన్నాయి. కానీ నేటి తరానికి అనుగుణంగా ఫీచర్స్, ఇంజన్ పనితీరు అనుకూలంగా ఉండే విధంగా కొన్ని కార్లు మాత్రం ఆకట్టుకుంటున్నాయి. అలాంటి కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
దక్షిణ కొరియా కంపెనీ అయిన KIA దేశంలో ప్రత్యేకంగా కార్లను తయారుచేస్తుంది. అయితే SUV కార్లను తీసుకురావడంలో ప్రత్యేకత సాధించుకున్న ఈ కంపెనీ 7 seater కార్ల విషయంలోనూ గుర్తింపు తెచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా దీని నుంచి మార్కెట్లోకి వచ్చిన కారెన్స్ కారు లగ్జరీ లుక్ తో ఆకట్టుకుంటుంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉండగా.. ఇది 6 స్పీడు మాన్యువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. అలాగే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా ఇందులో అమర్చారు. దీనిని మార్కెట్లో రూ 10.99 లక్షల ప్రారంభంతో విక్రయిస్తున్నారు. SUV కార్లను మార్కెట్లోకి తీసుకురావడంలో టయోటా కంపెనీ గుర్తింపు పొందింది. ఈ కంపెనీ నుంచి బెస్ట్ MPV గా రూమియన్ 7 seater కారు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో 1.5 లీటర్ అస్పిరేటెడ్ ఇంజన్ కలిగి ఉంది. ఇందులో CNG ఆప్షన్ కూడా ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది.
దేశంలో కార్ల విక్రయాల్లో అగ్రగామి సంస్థగా ఉన్న మారుతి సుజుకి నుంచి ఎర్టిగా 7 సీటర్ కారు ది బెస్ట్ గా నిలుస్తోంది. దీని ధర రూ.8.80 లక్షలు గా ఉంది. వినియోగదారులు సొంత అవసరాలతో పాటు ట్రావెల్ కోసం ఉపయోగించేవారు ఈ కారుపై ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు.
రెనాల్ట్ కంపెనీకి చెందిన ట్రైబర్ 7 సీటర్ కారు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీన్ని రూ.5.76 లక్షల ప్రారంభ ధరలతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో 1.0 లీటర్ నేచురల్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. అలాగే ఇందులో CNG ఆప్షన్ కూడా ఉండడంతో మైలేజ్ విషయంలో కొనుగోలుదారులకు మద్దతుగా ఉంటుంది. అలాగే మార్కెట్లో అతి తక్కువ ధర తో ఉన్న సెవెన్ సీటర్ కార్లలో నిస్సాన్ కంపెనీకి చెందిన గ్రానైట్ కూడా ఉంది. దీనిని మార్కెట్లో రూ.5.65 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.