https://oktelugu.com/

కేవలం 101 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే ఛాన్స్.. ఎలా అంటే?

మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ రానుంది. పండుగ సందర్భంగా ప్రముఖ మొబైల్ సంస్థలు స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై ఆఫర్లను అందిస్తుండటం గమనార్హం. తాజాగా వివో అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. కేవలం 101 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని ఈ సంస్థ అందిస్తుండటం గమనార్హం. అయితే ఈ ఆఫర్ కు అర్హత సాధించాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. వివో బజాజ్ ఫైనాన్స్ తో జత కట్టి ఈ ఆఫర్ ను ప్రకటించింది. ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 29, 2021 / 08:52 PM IST
    Follow us on

    మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ రానుంది. పండుగ సందర్భంగా ప్రముఖ మొబైల్ సంస్థలు స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై ఆఫర్లను అందిస్తుండటం గమనార్హం. తాజాగా వివో అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. కేవలం 101 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని ఈ సంస్థ అందిస్తుండటం గమనార్హం. అయితే ఈ ఆఫర్ కు అర్హత సాధించాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. వివో బజాజ్ ఫైనాన్స్ తో జత కట్టి ఈ ఆఫర్ ను ప్రకటించింది.

    ఈ ఆఫర్ ద్వారా 15,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఖరీదైన స్మార్ట్ ఫోన్స్ ను కొనుగోలు చేయవచ్చు. నెలనెలా ఈఎంఐ పద్దతుల్లో స్మార్ట్ ఫోన్ ను కొన్న మొత్తాన్ని చెల్లించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వివో ఎక్స్ 70 సిరీస్‌ స్మార్ట్ ఫోన్లతో పాటు వివో వై73, వివో వీ 21 రేంజ్‌, వివో వై33ఎస్ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై ఈ ఆఫర్లకు అర్హత పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    అయితే ఎక్కువ ధర ఉన్న స్మార్ట్ ఫోన్లపై మాత్రమే ఈ ఆఫర్ ఉండటంతో సామాన్య ప్రజలకు ఈ ఆఫర్ వల్ల ప్రయోజనం చేకూరదు. ఈ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై 10 శాతం క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది. ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు, కొటాక్ మహీంద్ర బ్యాంకు, హెడీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ బ్యాంకు సిటీ బ్యాంకు కార్డుల ద్వారా స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.

    వివో ఇండియా స్టోర్ లో మొబైల్ ను కొనుగోలు చేయడం ద్వారా ఈ ఆఫర్ కు అర్హత సాధించవచ్చని చెప్పవచ్చు. నవంబర్ నెల 7వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈకామర్స్ వెబ్ సైట్ల ద్వారా ఆఫర్లను బట్టి వివో స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.