ఈ కారణాల వల్లే కార్డియాక్ అరెస్ట్ వస్తుందట.. ప్రాణాలు ఎలా నిలుపుకోవాలంటే?

ఈ మధ్య కాలంలో చాలామంది కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోతున్న సంగతి తెలిసిందే. కార్డియాక్ అరెస్ట్ అంటే ఒక విధంగా ప్రాణాంతకమైన గుండె సంబంధింత వ్యాధి అని చెప్పవచ్చు. కార్డియాక్ అరెస్ట్ సంభవించిన వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. మన దేశంతో పోలిస్తే అమెరికాలో ఎక్కువమంది ఈ సమస్య బారిన పడుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ రావడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకే ప్లేస్ లో కూర్చుని పని చేసే జీవన శైలి, […]

Written By: Navya, Updated On : October 29, 2021 8:45 pm
Follow us on

ఈ మధ్య కాలంలో చాలామంది కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోతున్న సంగతి తెలిసిందే. కార్డియాక్ అరెస్ట్ అంటే ఒక విధంగా ప్రాణాంతకమైన గుండె సంబంధింత వ్యాధి అని చెప్పవచ్చు. కార్డియాక్ అరెస్ట్ సంభవించిన వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. మన దేశంతో పోలిస్తే అమెరికాలో ఎక్కువమంది ఈ సమస్య బారిన పడుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ రావడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

ఒకే ప్లేస్ లో కూర్చుని పని చేసే జీవన శైలి, ధూమపానం, శరీరంలో పొటాషియం, మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉండటం, వంశపారంపర్యంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు వల్ల కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు కార్డియాక్ అరెస్ట్ సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

శ్వాస సంబంధిత సమస్యలు, తరచూ అలసటగా అనిపించడం, తల తిరగడం, వాంతి, స్పృహ కోల్పోవడం, ఛాతీ నొప్పి, గుండెల్లో దడ, ఇతర ఆరోగ్య సమస్యలు కార్డియాక్ అరెస్ట్ లక్షణాలుగా ఉంటాయి. ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అనే పరీక్షను నిర్వహించి వెంటనే చికిత్స అందిస్తే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు తక్కువని చెప్పవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా ప్రాణాంతక వ్యాధి అయిన కార్డియాక్ అరెస్ట్ నుంచి తప్పించుకోవచ్చు.

ఏవైనా గుండె సంబంధిత సమస్యలు వస్తే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుని చికిత్స చేయించుకుంటే మంచిది. కరోనరీ హార్ట్ డిసీజ్‌తో బాధ పడే వాళ్లు, గుండె పరిమాణం ఎక్కువగా ఉన్నవాళ్లు, పుట్టుకపోతే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు, గుండె విద్యుత్ వ్యవస్థతో సమస్యలు తలెత్తిన వాళ్లు ఈ ఆరోగ్య సమస్యలతో బాధ పడే ఛాన్స్ ఉంటుంది.