దేశీయ టెలీకాం దిగ్గజం జియో దీపావళి పండుగ రోజున జియోఫోన్ నెక్స్ట్ ను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జియో స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ప్రకటన వెలువడింది. రిలయన్స్ సెప్టెంబర్ నాటికి ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటన చేయగా చిప్స్ కొరత వల్ల ఈ ఫోన్ విడుదల వాయిదా పడింది. ప్రగతి ఓఎస్ అనే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను ఈ స్మార్ట్ ఫోన్లలో వినియోగించారు.
ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర 6,499 రూపాయలు కాగా ఈఎంఐ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలని అనుకుంటే మొదట 1,999 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 18, 24 నెలల్లో ఈ.ఎం.ఐ ద్వారా మిగిలిన డబ్బును చెల్లించవచ్చు. 5.45 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేతో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 చిప్ సెట్ ను వినియోగించారు.
ఈ స్మార్ట్ ఫోన్ లో 3500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉండగా అడ్రినో 306 జీపీయును వినియోగించారు. ఈ ఫోన్ లో 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరాతో పాటు, 8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ గో ఓఎస్ నిక్షిప్తమై ఉండటంతో పాటు స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో మైక్రో యూఎస్‌బీ, ఇంటర్నల్ మెమోరీ 32 జీబీ, డ్యూయల్ సిమ్, ఇతర సదుపాయాలు ఉన్నాయి.
ఈ ఫోన్ పోట్రయిట్ మోడ్ తో పాటు ఇతర ఫోటోగ్రఫీ మోడ్స్ ను సపోర్ట్ చేయడం జరుగుతుంది. నైట్ మోడ్ సహాయంతో తక్కువ కాంతి ఉన్న సమయంలో కూడా అందంగా ఫోటోలను తీయడం సాధ్యమవుతుంది. లిజన్, ట్రాన్స్ లేట్ ఆప్షన్స్ ద్వారా కంటెంట్ ను ఎంచుకున్న భాషలోకి అనువదించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.