https://oktelugu.com/

10,000 రూపాయల పెట్టుబడితో 17,000 సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే?

మనలో చాలామంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలని భావిస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్ లోని ‘ఫండ్స్ ఆఫ్ ఫండ్స్’ విభాగంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ తాజాగా ఎస్&పీ బీ.ఎస్.ఈ 500 ఈటీఎఫ్ యూనిట్లలో పెట్టుబడి పెట్టే ఓపెన్ ఎండ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్ ను మొదలుపెట్టింది. ఫండ్స్ ఆఫ్ ఫండ్ అనగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ పథకం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 17, 2021 / 09:16 AM IST
    Follow us on

    మనలో చాలామంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలని భావిస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్ లోని ‘ఫండ్స్ ఆఫ్ ఫండ్స్’ విభాగంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ తాజాగా ఎస్&పీ బీ.ఎస్.ఈ 500 ఈటీఎఫ్ యూనిట్లలో పెట్టుబడి పెట్టే ఓపెన్ ఎండ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్ ను మొదలుపెట్టింది. ఫండ్స్ ఆఫ్ ఫండ్ అనగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ పథకం అని చెప్పవచ్చు.

    ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఇతర స్కీమ్స్ కు సంబంధించిన యూనిట్లను కలిగి ఉంటుంది. నవంబర్ 12వ తేదీన కొత్త ఫండ్ ఆఫర్ మొదలు కాగా నవంబర్ 26వ తేదీ వరకు సబ్ స్క్రిప్షన్ ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువ రాబడిని అందిస్తాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇండియా థీమాటిక్ అడ్వాంటేజ్ ఫండ్ సంవత్సర కాలంలో ఏకంగా 74.48 శాతం రాబడిని ఇవ్వడం గమనార్హం.

    నిప్పాన్ ఇండియా జూనియర్ బీఈఎస్ ఎఫ్‌ఓఎఫ్ 53 శాతం రాబడిని ఇవ్వగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇండియా ఈక్విటీ ఎఫ్‌ఓఎఫ్ 73.6 శాతం రాబడిని, క్వాంటం ఈక్విటీ ఫండ్స్ 48.89 శాతం రాబడిని ఇచ్చాయి. ఈ స్కీమ్స్ లో కనీస పెట్టుబడి 1,000 రూపాయలుగా ఉంటుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ఈ స్కీమ్ లో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

    సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ ఫ్యాక్టర్ తగ్గే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు పెట్టుబడి మారెక్ట్ రిస్క్ కు లోబడి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. నిపుణుల సలహాలు, సూచనలను తీసుకుని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని చెప్పవచ్చు.