భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సెంట్రల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఘజియాబాద్‌లో ఉన్న ఈ సంస్థ పది ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. కంప్యూటర్ సైన్స్ లో బీఈ, బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. టెక్నికల్ నైపుణ్యాలతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో ఫుల్ టెం బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు సంబంధిత విభాగంలో అనుభవంతో పాటు టెక్నికల్ నైపుణ్యాలను కలిగి ఉండాలి. 2021 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీలోపు 32 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.
ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు 50,000 రూపాయలనుంచి 1,60,000 రూపాయల వరకు వేతనం లభించే ఛాన్స్ అయితే ఉంటుంది. రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది.
2021 సంవత్సరం డిసెంబర్ 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.