ఏపీలో పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

ప్రస్తుత కాలంలో నిరుద్యోగులకు మేలు జరిగేలా ఎన్నో జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వరుసగా జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ అవుతుండగా ఈ జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. ఏపీ పోస్టల్ సర్కిల్ తాజాగా 75 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఏపీ పోస్టల్ సర్కిల్ ద్వారా రిలీజైన ఈ జాబ్ నోటిఫికేషన్ లో వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని సమాచారం. నవంబర్ 27వ […]

Written By: Navya, Updated On : November 17, 2021 9:40 am
Follow us on

ప్రస్తుత కాలంలో నిరుద్యోగులకు మేలు జరిగేలా ఎన్నో జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వరుసగా జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ అవుతుండగా ఈ జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. ఏపీ పోస్టల్ సర్కిల్ తాజాగా 75 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఏపీ పోస్టల్ సర్కిల్ ద్వారా రిలీజైన ఈ జాబ్ నోటిఫికేషన్ లో వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని సమాచారం.

నవంబర్ 27వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు చివరితేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ఫీజు లేదు. ఆన్ లైన్ లో కూడా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటుంది. వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది.

మొత్తం 75 ఉద్యోగ ఖాళీలలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 19, సార్టింగ్ అసిస్టెంట్ 4 ఉద్యోగ ఖాళీలు, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్/రీజనల్ ఆఫీస్ 3, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉద్యోగ ఖాళీలు 4, పోస్ట్ మ్యాన్ ఉద్యోగ ఖాళీలు 18, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలు 27 ఉన్నాయి. బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి పది, ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 25,000 రూపాయల నుంచి 81,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.