Chai Sutta Bar Success Story: జనాల అవసరాలు తీర్చేందుకు ఒకప్పుడు వ్యాపారాలు మొదలయ్యాయి. చాలామంది జనాల అవసరాలు తెలుసుకుని వ్యాపారాలు మొదలుపెట్టారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పటి కాలంలో జనాలకు అవసరాలు క్రియేట్ చేసి.. వాటిని తీర్చగలిగే సామర్థ్యం ఉన్నవారే వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. ఇందులో నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ సాధిస్తున్నారు. అలా సాధించిన ఇద్దరు స్నేహితులు ఏకంగా 150 కోట్లకు ఎదిగారు.
Also Read: విశాఖకు కేంద్రం గుడ్ న్యూస్!
గత కొంతకాలంగా మనదేశంలో చాయ్ అవుట్లెట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు చాయి విక్రయించే విధానాన్ని సరికొత్తగా మార్చుతున్నాయి. అందువల్లే చాయ్ వ్యాపారం మనదేశంలో వేలకోట్లకు ఎదిగింది. ఇంకా ఎదిగే అవకాశం కూడా ఉంది. అయితే ఏ కంపెనీ కూడా ఊహించని విధంగా.. ఏ కంపెనీ కూడా ఆలోచించని విధంగా ఇద్దరు స్నేహితులు ఒక ఛాయ్ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దానిని అంతకంతకూ విస్తరించి ఒక రేంజ్ లో తమ వ్యాపారాన్ని బలోపేతం చేసుకున్నారు. ఈ ప్రయాణంలో వారికి ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. తద్వారా అద్భుతమైన వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు.
మనదేశంలో ప్రధానమైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో “చాయ్ సుట్ట బార్” అనే పేరుతో చాయ్ విక్రయించే దుకాణాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ దుకాణాలు జన సమర్థమైన ప్రాంతాలలో ఉండవు. కమర్షియల్ కాంప్లెక్స్ లలో ఉండవు. కేవలం లేడీస్ హాస్టల్స్ ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఉంటాయి. యూత్ ను అట్రాక్ట్ చేసే విధంగా ఈ అవుట్లెట్లు ఉంటాయి. కేవలం లేడీస్ హాస్టల్స్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వీటికి ఫ్రాంచైజీ ఇస్తారు.. 2016లో ఇద్దరు స్నేహితులు కేవలం ₹3 లక్షల పెట్టుబడితో టీ దుకాణాన్ని మొదలుపెట్టారు. లేడీస్ హాస్టల్ ఉన్న ప్రాంతంలో వీరు టీ స్టాల్ ఏర్పాటు చేయడంతో.. అది లాభాల బాట పట్టింది.. ఆ తర్వాత వీరు ఆ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించారు.
తమ వ్యాపారాన్ని కార్పొరేట్ మయంగా మార్చారు. ఫ్రాంచైజీలు ఇవ్వడం మొదలుపెట్టారు. కేవలం లేడీస్ హాస్టల్స్ ఉన్న ప్రాంతంలోనే అవుట్లెట్లు ఏర్పాటు చేయించారు. తద్వారా తమ వ్యాపారాన్ని 150 కోట్లకు పెంచుకున్నారు. దేశ వ్యాప్తంగా తమ ఔట్లెట్ల సంఖ్యను 400 కు పెంచుకున్నారు.. కేవలం లేడీస్ హాస్టల్స్ ఉన్న ప్రాంతంలోనే ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం.. ఆ పరిసర ప్రాంతాల్లోకి యువత అధికంగా వస్తారు కాబట్టి.. అక్కడ వారు టీ తాగడానికి ఇష్టపడతారు కాబట్టి, టీ అవుట్ లెట్లు ఏర్పాటు చేశారు. టీ, స్నాక్స్, ఇతర డ్రింక్స్ ఇందులో అందుబాటులో ఉంచారు.. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ టి దుకాణాలు.. వచ్చే రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికల రూపొందించుకున్నామని ఆ స్నేహితులు చెబుతున్నారు.
View this post on Instagram