Vizag Coastal Atmospheric Test Bed: విశాఖకు( Visakhapatnam) గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. వాతావరణ అంచనాలు మరింత కచ్చితంగా ఉండేందుకు.. అంచనాల్లో కచ్చితంగా ఫోకస్ చేసింది. దీనికోసం మిషన్ మౌసం ద్వారా దేశంలో చాలా చోట్ల టెస్ట్ బెడ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా సాగర తీరనగరం విశాఖలో కూడా ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. తీర ప్రాంత అధ్యయనం కోసం కోస్టల్ అట్మాస్పియరిక్ రీసెర్చి టెస్ట్ బెడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. విశాఖలో ఏర్పాటయితే మాత్రం వాతావరణ శాఖ అంచనాల్లో మరింత కచ్చితత్వం పెరుగుతుంది. పూణేలోని ఐఐటీఎం ఆధ్వర్యంలో ఈ టెస్ట్ బెడ్ లను ఏర్పాటు చేస్తున్నారు.
Also Read: ఆ దిగ్గజ ఐటీ కంపెనీ రాకతో.. వైజాగ్ వికసించనుందా?
దేశవ్యాప్తంగా ఏర్పాటు..
అయితే ఈ టెస్ట్ బెడ్( test bed) ల ఏర్పాటు కొత్త కాదు. గతంలో మధ్యప్రదేశ్లోని సిహోర్లో రూ.125 కోట్లతో ఏర్పాటుచేసిన టెస్ట్ బెడ్ ను ప్రారంభించారు. తాజాగా ఢిల్లీ, ముంబై, చెన్నైలో కూడా అర్బన్ టెస్ట్ బెడ్ లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు విశాఖలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం విశేషం. దేశంలో మొదటిసారిగా వాతావరణ అంచనా వేయడానికి 30 అత్యాధునిక పరికరాలు రానున్నాయి. ఈ పరికరాలు గాలిలో ఉండే చిన్న రేణువులు, మేఘాలు, గాలులు, రేడియేషన్ వంటిని గుర్తిస్తాయి. ఈ సమాచారం విద్యార్థులతో పాటు పరిశోధకులకు భవిష్యత్తులో పరిశోధనల కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల వాతావరణం గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.
Also Read: నల్లగా మారిపోతున్న వైజాగ్ తీరప్రాంతం.. ఏమవుతోంది..? భయాందోళనలు
మొబైల్ రాడార్ ఏర్పాటు..
సాధారణంగా విపత్తులను తెలుసుకునేందుకు చాలా దేశాలు మొబైల్ రాడార్లను( mobile radars ) వాడుతాయి. అమెరికా సైతం దీనినే అనుసరిస్తోంది. నేషనల్ ఓషియానిక్ అండ్ ఎట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ సమస్త అమెరికాలో ఉంది. తుఫాన్లతో పాటు హరికేన్లను తెలుసుకునేందుకు మొబైల్ రాడార్లను వాడుతోంది. ఇప్పుడు అలాంటి రాడార్ను విశాఖలో ఏర్పాటు చేయనున్నారు. ఈ రాడారు ఉన్న వాహనం తూర్పు తీరంలో తిరుగుతూ వాతావరణాన్ని గమనిస్తుంది. తద్వారా తుఫానులు వచ్చే సమయాన్ని అంచనా వేయవచ్చు. ఈ రాడార్లను ట్రక్కుల వెనుక అమర్చుతారు. వీటిని డప్పులర్ రాడార్లు అంటారు. విపత్తులు సంభవించే సమయంలో వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. తుఫానులను ముందుగానే గుర్తించవచ్చు. నష్ట తీవ్రతను కొంతవరకు తగ్గించవచ్చు.