Mega Family Hero: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి మెగా ఫ్యామిలీ గుర్తుకొస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు యావత్ ప్రేక్షకలోకాన్ని మెప్పించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే పెను ప్రభంజనాలను సృష్టించాయి. ఇక 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…మరి ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చి భారీ విజయాలను అందుకున్నారు… ఇక ఇదిలా ఉంటే బుల్లితెర మీద సందడి చేసిన షో లలో మంచి పాపులారిటిని సంపాదించుకున్న షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అనే చెప్పాలి. మరి ఇప్పటివరకు ఈ షో కి చాలామంది కంటెస్టెంట్లుగా వచ్చి సెలబ్రిటీగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
Also Read: రాజాసాబ్ సినిమా కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
మరి ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఈ షో కి ఒక హీరో రాబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో నుంచి ఏ హీరో ఈ షో కి కంటెస్టెంట్ గా రాబోతున్నాడు అని ఆలోచిస్తున్నారా… మొగలిరేకులు సీరియల్ తో మంచి పాపులారిటీని సంపాదించుకున్న సాగర్ బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన మెగా ఫ్యామిలీ హీరో ఎలా అవుతాడు అని మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు…
చిరంజీవి వాళ్ళ అమ్మ అయిన అంజనా దేవి మొగలి రేకులు సాగర్ కు వీరా అభిమాని ఆ సీరియల్ లో ఆర్కే నాయుడుగా తన పాత్ర అద్భుతంగా ఉందని ఆయన్ని ఇంటికి పిలిపించుకొని మరి అతన్ని కలిసి అతనితో చాలాసేపు మాట్లాడిందట. ఇక అప్పటినుంచి సాగర్ తో అంజనా దేవి నువ్వు కూడా మెగా ఫ్యామిలీ హీరోనే అంటూ చెప్పిందట…అప్పటి నుంచి అంజనా దేవి సాగర్ ను తన ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటోంది.
Also Read: ‘అగ్నిపరీక్ష’ షోలో అభిజిత్ పై సంచలన ఆరోపణలు చేసిన కంటెస్టెంట్..వీడియో వైరల్!
ఇక సాగర్ కి చిరంజీవితో గాని, పవన్ కళ్యాణ్ తో గాని సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సాగర్ బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంటర్ ఇవ్వబోతున్నాడు. కాబట్టి అతన్ని మెగా ఫ్యామిలీ హీరో గానే భావించి ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం కూడా అతన్ని అలాగే ఇన్వైట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా సాగర్ ఈ షో లోకి వస్తాడా లేదా అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది…