https://oktelugu.com/

Cash Cheking :ఎలక్షన్ టైం : రూ.50,000 ల కంటే ఎక్కువగా నగదు తీసుకెళ్తే సీజ్.. ఈ ఫ్రూప్స్ తప్పనిసరి

పెళ్లిళ్లు జరిగే ఇళ్లలో డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది. కొత్త దుస్తుల నుంచి ఆభరణాలు, ఇతర ఖర్చులు భారీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో లక్షల రూపాయలు చేతితో తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : April 2, 2024 / 04:15 PM IST

    Cash cheking in telugu states

    Follow us on

    Cash Ride Police: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. దీంతో చాలా చోట్ల ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ కోడ్ నేపథ్యంలో డబ్బు సరఫరా విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇందులో భాగంగా డబ్బు సరఫరా చేయకుండా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఎవరిదగ్గరనైనా రూ.50 వేల కంటే ఎక్కువగా నగదు ఉంటే.. దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేకపోతే ఆడబ్బును సీజ్ చేస్తారు. అలాగే రూ.10 లక్షల కంటే ఎక్కువగా డబ్బు తీసుకెుళ్లేవారు ఎటువంటి ఆధారాలు లేకపోతే ఆ మొత్తం ఇన్ కంట టాక్స్ కు వెళ్తుుంది. అయితే రూ.50 వేల కంటేఎక్కువగా తీసుకెళ్లే వారు ఈ ప్రూప్ తప్పనిసరిగా ఉంచుకోవాలి.

    లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో డబ్బు పంపిణీ ఉండనుంది. ఈ తరుణంలో ఓటర్లకు రాజకీయ నాయకులు డబ్బులు పంచుతారనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా పోలీసులు విస్తృత తనిఖీ లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నుంచి డబ్బు పట్టుకున్నారు. అయితే వీటిలో కొన్నింటికి సంబంధించి ప్రూఫ్ చూపిస్తే వదిలేస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోతే మాత్రం ఆ డబ్బును సీజ్ చేస్తారు. అయితే ఇటీవల కాలంలో పెళ్లిళ్ల జోరు కొనసాగతోంది. శ్రీరామనవి సందర్భంగా డబ్బు వివిధ అవసరాల నిమిత్తం అవసరం ఉంటుంది. ఇలాంటప్పుడు ఎలాంటి ఫ్రూఫ్ ఉంచుకోవాలంటే?

    పెళ్లిళ్లు జరిగే ఇళ్లలో డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది. కొత్త దుస్తుల నుంచి ఆభరణాలు, ఇతర ఖర్చులు భారీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో లక్షల రూపాయలు చేతితో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భంగా పోలీసులు తనిఖీలు ఆ డబ్బు కనిపిస్తే వారు సీజ్ చేస్తారు. అయితే వారికి ఆధారంగా పెళ్లి కార్డు చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏ షాపు నుంచి కోనుగోలు చేస్తారో? ఏ అవసరాలకు ఉపయోగిస్తారో స్పష్టంగా వారికి తెలియజేయాల్సి ఉంటుంది. తగిన ఆధారాలు చూపిస్తే పోలీసులు ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తారు.

    అయితే రూ.10 లక్షల కంటే ఎక్కువ డబ్బు తీసుకెళ్తుండగా దొరికితే మాత్రం ఆ మొత్తానికి సంబంధించి సరైన ఆధారాలు ఉండాలి. లేకపోతే దానిన ఇన్ కం టాక్స్ వారు వచ్చి తీసుకెళ్తారు. అందువల్ల ఎన్నికలు పూర్తయ్యే వరకు వివిధ అవసరాల కోసం డబ్బును తీసుకెళ్తే వాటికి సంబంధించిన ఆధారాలను తప్పనిసరిగా ఉంచుకోవాలి.