Car buyers alert: నేటి కాలంలో చాలామంది కారు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. అయితే కారు కొనడానికి కొంతమంది వద్ద డబ్బు ఉంటుంది. మరి కొంతమంది వద్ద సరైన ఆదాయం ఉండదు. కానీ కారులో తిరగాలని అనుకుంటారు. వాస్తవానికి కారు కొనుగోలు చేసేవారు నెట్టు క్యాష్ తో కొనడం కంటే లోన్ తీసుకొని కొనుగోలు చేయడం ఎంతో ఉత్తమం అని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవల వినిపిస్తున్న కొన్ని కథనాల ప్రకారం లోన్ తీసుకోవడం ద్వారా ఎన్నో రకాల ఈఎంఐ భారం పెరిగిపోతుందని అంటున్నారు. కానీ కారు కొనుగోలు విషయంలో మాత్రం లోన్ తీసుకోవడం ద్వారానే లక్షల రూపాయలు సేవ్ అవుతాయని చెబుతున్నారు మరి ఆ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
చిన్న ఫ్యామిలీకి అయినా సరే ఇప్పుడు కారు తప్పనిసరి అయిపోయింది. ఎందుకంటే టూవీలర్ లక్ష రూపాయలకు పైగానే ఉంటుంది. టూ వీలర్ పై ఫ్యామిలీ మొత్తం వెళ్లే అవకాశం ఉండదు. దూర ప్రయాణాలు చేయడానికి టూ వీలర్ అనుకూలంగా ఉండదు. అందువల్ల కాస్త ఆదాయాన్ని వెచ్చించి కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. అయితే కొంతమంది పూర్తిగా డబ్బు చెల్లించి కారు కొనవాలని అనుకుంటారు. ఎందుకంటే నెల నెల ఈఎంఐ భారం ఉంటుందని.. సమయానికి డబ్బులు లేకపోతే ఇబ్బందులు ఏర్పడతాయని అనుకుంటారు. కానీ కొన్ని రకాల క్యాలిక్యులేషన్స్ చూస్తే కారును మొత్తం డబ్బులు వెచ్చించి కొనడం కంటే లోన్ ద్వారా తీసుకోవడమే మంచిదని అంటున్నారు.
ఉదాహరణకు రూ. 10 లక్షల విలువైన కారును కొనుగోలు చేయాలని అనుకుంటే.. దీనికి రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే పూర్తి డబ్బు ఉన్నవారు రూ. 8 లక్షలు చెల్లించాలని అనుకుంటారు. కానీ ఈ 8 లక్షల రూపాయలను లోన్ ద్వారా తీసుకోవాలి. అలా తీసుకుంటే 9 శాతం రేట్ అఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. ఇలా లోన్ తీసుకుంటే ఐదు సంవత్సరాల వరకు. 2 లక్షల వడ్డీ పడుతుంది. అలాగే లోన్ తీసుకోకుండా రూ.8 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే.. దాదాపు 4 లక్షల రూపాయల వడ్డీ వస్తుంది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ పై రేట్ అఫ్ ఇంట్రెస్ట్ 5% మాత్రమే ఉంటుంది. అయినా కూడా ఈ డిఫరెంట్ ఏంటి అని అనుమానం రావచ్చు.
ఈఎంఐ పే చేసేటప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గుతుంది. ఇలా తగ్గిన అమౌంట్ పై మాత్రమే వడ్డీ విధిస్తారు. అదే ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఒకే రకమైన వడ్డీ వస్తుంది. ఇలా లోన్ తీసుకునే దానికంటే ఫిక్స్డ్ డిపాజిట్ పై ఎక్కువ లాభం పొందవచ్చు. అంతేకాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రమే కాకుండా ఇతర పెట్టుబడులకు కూడా ఉపయోగించవచ్చు. లోన్ తీసుకున్న కారు ఒకవేళ ట్రావెల్స్కు ఉపయోగిస్తే.. దానిపై వచ్చే అమౌంట్ తో ఈఎంఐ పే చేసుకోవచ్చు. ఈ విధంగా ఫైనాన్స్ ప్లానింగ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది.