Super idea for success: మంచి జీవితం కావాలని ఎవరైనా కోరుకుంటారు. అయితే ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని అందుకోసం శ్రమిస్తే ఎప్పటికైనా అక్కడికి చేరుకొని మంచి జీవితాన్ని పొందవచ్చు. కానీ ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు తగులుతూ ఉంటాయి. ఒక్కోసారి మనం చేసే పని అస్సలు ముందుకు వెళ్లకపోవచ్చు. ఉద్యోగం కూడా ఊడిపోవచ్చు. వ్యాపారం తీవ్ర నష్టాలకు గురి కావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య నిత్యం ఘర్షణ వాతావరణ ఉండవచ్చు. అయితే ఈ సమస్యలకు పరిష్కారం ఏంటో ఒక్కోసారి అర్థం కాదు. కానీ ఇలా చేయడం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా అనుకున్నది సాధిస్తారు. ఇంతకీ ఏం చేయాలి?
ఒక్కోసారి వచ్చే కష్టాలను చూస్తే ఈ జీవితం ఎందుకు? అని అనిపిస్తుంది. జీవితంలో ఏదీ సాధించలేక పోతే మనం ఎందుకు? అన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే చాలామంది ఎక్కువగా బాధపడేది తమ గురించి కంటే సమాజం గురించే. ఎందుకంటే డబ్బు సంపాదించడానికి కొన్నిచోట్ల బిడియం అడ్డు వస్తుంది. మరికొన్నిచోట్ల అహం అడ్డు వస్తుంది. వీటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాలంటే ధైర్యం కావాలి. ఒక్కోసారి ఆలోచన కూడా ఉండాలి. కానీ పరిస్థితి బాగా లేనప్పుడు ఇవేవీ ఉండవు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. చేతిలో ఎలాంటి అవకాశం లేనప్పుడు.. ఎవరి వల్ల మీకు ఉపయోగం లేనప్పుడు.. లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటే ఈ పని కచ్చితంగా చేయాలి.
ఆరు నెలల పాటు కుటుంబ సభ్యులతో తప్ప ఎవరితోనూ మాట్లాడకుండా.. ఎవరినీ కలవకుండా.. ఎవరికి ఫోన్ చేయకుండా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకూడదు. కాలక్షేపాన్ని పక్కకు పెట్టాలి. సీరియస్ గా అనుకున్న దానిపై దృష్టి పెట్టాలి. సరదా కోసం ఎంతోమంది పిలుస్తూ ఉంటారు. కొన్నాళ్లపాటు ఇలాంటి వారికి దూరంగా ఉండాలి. మీరు చేసే పనులు ఎవరికి తెలియకుండా ఉండాలి. ఎందుకంటే ఎదుటివారు తమకు తగిన విధంగా సూచనలు ఇస్తుంటారు. ఇవి ఒక్కోసారి మీ జీవితానికి అనుగుణంగా ఉండవు. ఒకవేళ బలవంతంగా పాటిస్తే లక్ష్యం నెరవేరదు.
అందువల్ల ఆరు నెలల పాటు ఒకే దృష్టి పెట్టి ముందుకు వెళితే కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. చెట్టుపై ఉన్న పిట్టను కొట్టేటప్పుడు చెట్టును చూడొద్దు.. అన్న విషయం ఇప్పటికే చాలామందికి తెలుసు. కానీ చెట్టుకు ఉన్న ఆకులే ఎక్కువగా చూస్తున్నారు. అంటే తమ జీవిత ప్రయాణంలో మధ్యలో వచ్చే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ప్రతి దానికి స్పందిస్తూ తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అలా చేయకుండా అనుకున్న పని చేసేంతవరకు ఎవరితో కాంటాక్ట్ లేకుండా ఉండడం వల్ల అనుకునేది సాధించడానికి మార్గం ఏర్పడుతుంది.కుటుంబ సభ్యుల్లోనూ మీ లక్ష్యాన్ని అర్థం చేచేసుకుంటేమాత్రమే వారితో డిస్కషన్ చేయాలి. ఒకవేళ హేళన చేస్తే వారిని అస్సలు కలవకుండా ఉండాలి.