Car AC : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఇంట్రో, ఆఫీసులో ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి. ప్రయాణిస్తున్నప్పుడు కూడా కారులో ఏసీ ఉండాల్సిందే. కాకపోతే కొన్ని సార్లు కార్లలో ఏసీలు సరిగా పనిచేయవు. ఏసీ ఆన్ లో ఉన్నా శరీరానికి చెమటలు పడుతూనే ఉంటాయి. చల్లగా ఉందన్న భావన కలుగదు. అలాంటప్పడు కారు ఏసీలో సమస్య ఉందని భావించాలి. వాస్తవానికి మనం ఇంటిలోని ఎయిర్ కండీషనర్ ఫిల్టర్‌ను ఎలా శుభ్రం చేస్తామో, అదే విధంగా కారు ఏసీలో ఉండే ఫిల్టర్‌ను కూడా శుభ్రం చేయాలి. ఫిల్టర్‌లో దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. దానిని శుభ్రం చేయకపోతే ఫిల్టర్ జామ్ కావచ్చు. ఎక్కువగా మురికిగా ఉండటం వల్ల ఏసీ నుండి చల్లటి గాలి రాదు.
Also Read : కారులో AC ఎక్కువగా వాడుతున్నారా? ఈ విషయం వెంటనే తెలుసుకోండి..
మీకు ఏసీ ఫిల్టర్‌ను మీరే శుభ్రం చేయడం తెలిస్తే చేసుకోవచ్చు. కానీ ఏసీ ఫిల్టర్‌ను ఎక్కడ నుంచి తీయాలి.. ఎలా శుభ్రం చేయాలో మీకు తెలియకపోతే దగ్గరలోని కార్ మెకానిక్ వద్దకు కారును తీసుకెళ్లి ఫిల్టర్‌ను శుభ్రం చేయించుకోవచ్చు. ఫిల్టర్ శుభ్రం చేయడానికి వీలుగా ఉంటే మెకానిక్ కారులో ఉన్న ఫిల్టర్‌ను శుభ్రం చేస్తాడు. కానీ ఫిల్టర్ పరిస్థితి పాడైతే వెంటనే దానిని మార్చవలసి ఉంటుంది.
ఏసీ ఫిల్టర్ ఎక్కడ ఉంటుంది?
సాధారణంగా కారులో ఏసీ ఫిల్టర్ గ్లోవ్ బాక్స్ వెనుక ఉంటుంది. దానిని చాలా సులభంగా తొలగించవచ్చు. కానీ మీకు ఈ పని చేయడం రాకపోతే రిస్క్ తీసుకోకండి. మెకానిక్ సహాయంతో ఏసీ ఫిల్టర్‌ను శుభ్రం చేయించుకోండి.
కార్ ఏసీ ఫిల్టర్ ధర
కారులో ఉపయోగించే ఏసీ ఫిల్టర్ ధర వేర్వేరు మోడళ్లకు వేర్వేరుగా ఉంటుంది. ఏసీ ఫిల్టర్ ధర రూ.200 నుండి ప్రారంభమవుతుంది. లగ్జరీ కార్లలో ఉపయోగించే ఏసీ ఫిల్టర్ ధర రూ.1000 కంటే ఎక్కువ ఉంటుంది.
Also Read : ఒక రాత్రంతా కారులో ఏసీ ఆన్ లో ఉంటే ఎన్ని లీటర్ల ఆయిల్ ఖర్చు అవుతుందో తెలుసా…