Homeలైఫ్ స్టైల్Car AC: ఒక రాత్రంతా కారులో ఏసీ ఆన్ లో ఉంటే ఎన్ని లీటర్ల ఆయిల్...

Car AC: ఒక రాత్రంతా కారులో ఏసీ ఆన్ లో ఉంటే ఎన్ని లీటర్ల ఆయిల్ ఖర్చు అవుతుందో తెలుసా…

Car AC: చాలా మంది కారును వాడుతున్నారు కానీ వాటి గురించి పూర్తి వివరాలు మాత్రం తెలుసుకోవడం లేదు.కారులో ఏసీ వాడకానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా సందర్భంలో రాత్రంతా కారులోనే నిద్రించాల్సి వస్తుంది.

Car AC: మనదేశం లో గత కొన్ని రోజుల నుంచి కార్లను కొనుగోలు చేసే వాళ్ళు రోజు రోజుకు పెరిగిపోతున్నారు.దీనికి ప్రధాన కారణం తక్కువ ధరల్లోనే మార్కెట్ లో కార్లు అందుబాటులో ఉండటం.అలాగే బ్యాంకు లు కూడా సులభంగా కారు లోన్ ఇవ్వడం జరుగుతుంది.దాంతో నలుగురు ఉన్న కుటుంబం ఎక్కడికైనా వెళ్లాలంటే బైక్ మీద వెళ్లే పరిస్థితి లేదు.అలాగని క్యాబ్ లేదా ఆటో బుక్ చేసుకున్న భారీగానే చెల్లించాల్సి వస్తుంది. దాంతో చాలా మంది సెకండ్ హ్యాండ్ కారును అయినా సరే కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

అయితే చాలా మంది కారును వాడుతున్నారు కానీ వాటి గురించి పూర్తి వివరాలు మాత్రం తెలుసుకోవడం లేదు.కారులో ఏసీ వాడకానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా సందర్భంలో రాత్రంతా కారులోనే నిద్రించాల్సి వస్తుంది.ఇక ఆ సమయంలో రాత్రంతా కారులో ఏసీ ఆన్ లోనే ఉంటుంది.అయితే దానికి ఎంత ఆయిల్ ఖర్చు అవుతుంది అనేది చాలా మందికి తెలియదు.

సాధారణంగా క్యాంపింగ్ చేసే వ్యక్తులు ఏసీ రన్నింగ్ తో కారులోనే నిద్రిస్తూ ఉంటారు.ఈ క్రమంలో కాంపాక్ట్ SUV రాత్రంతా ఏసీ ఆన్ లో ఉంచితే ఎంత ఆయిల్ బర్న్ అవుతుందో చాలా మందికి అవగాహనా ఉండదు.ప్రస్తుతం దీనికి సంబంధించి యూట్యూబ్ లో ఒక వీడియొ ట్రేండింగ్ లో ఉంది.ఇక ఈ వీడియొ లో ఒక కారులో ఆరు గంటలు ఏసీ ఆన్ లో ఉంటే ఎంత ఆయిల్ ఖర్చు అవుతుందో చెప్పబడింది.

వైరల్ అవుతున్న ఈ వీడియొ లో ఒక వ్యక్తి తన కారులో ఫుల్ ట్యాంక్ ఆయిల్ వేయించి రాత్రి 11 గంటలకు ఏసీ ఆన్ చేసి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ఏసీ నీ ఆఫ్ చేసాడు.ఇలా ఆరు గంటల పాటు కంటిన్యూ గా ఏసీ ఉండడంతో 3 .02 లీటర్ల ఆయిల్ బర్న్ అయ్యింది.ఇలా రాత్రంతా కారులో ఏసీ ఆన్ లో ఉంచుకోవాలంటే అయ్యే ఖర్చు 250 నుంచి 300 రూపాయలు.ఇంజిన్ సామర్ధ్యం పై కూడా కారు ఎంత ఆయిల్ వినియోగిస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper