https://oktelugu.com/

Credit Card: క్రెడిట్‌ కార్డు బకాయి తీర్చలేకపోతున్నారా? ఇలా చేస్తే సరిపోతుంది!

కేవలం ఒక్క ఫోన్ కాల్ తో వారికి కావాల్సిన వివరాలు తీసుకొని కార్డులను ఇంటికి పంపిస్తున్నారు. మధ్య తరగతి వ్యక్తి వద్ద కూడా పదుల సంఖ్యలో క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. క్రెడిట్ కార్డుల్లో రూపే కార్డులు కూడా వస్తున్నాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : June 7, 2024 / 03:41 PM IST

    Credit Card

    Follow us on

    Credit Card: మార్కెట్లో డిజిటల్ మనీ వినియోగం పెంచేందుకు బ్యాంకులు క్రెడిట్ కార్డులను తీసుకువచ్చాయి. వీటితో ఎక్కువ మొత్తంలో డిజిటల్ మనీ లావాదేవీలు జరుగుతాయి. ఏదైనా వస్తువు కొనాలన్నా, హోటల్, రెస్టారెంట్లలో ఖర్చు పెట్టిన డబ్బులు కట్టాలన్నా ఆందోళన చెందకుడా క్రెడిట్ కార్డులతో కట్టేయవచ్చు. ఒకప్పుడు క్రెడిట్ కార్డు కావాలంటే ఎంతో ప్రాసెస్ ఉండేది. కానీ అది నేడు చాలా సులభతరం అయ్యింది. కాలర్స్ ఫోన్ చేసి మరీ కార్డులను ప్రొవైడ్ చేస్తున్నారు.

    కేవలం ఒక్క ఫోన్ కాల్ తో వారికి కావాల్సిన వివరాలు తీసుకొని కార్డులను ఇంటికి పంపిస్తున్నారు. మధ్య తరగతి వ్యక్తి వద్ద కూడా పదుల సంఖ్యలో క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. క్రెడిట్ కార్డుల్లో రూపే కార్డులు కూడా వస్తున్నాయి. వీటితో దేశంతో పాటు మరికొన్ని దేశాల్లో ఏ మూలకు వెళ్లినా వినియోగించుకోవచ్చు. 5 రూపాయల చాక్లెట్ నుంచి బ్యాంకు నిర్ధారించిన మేరకు డబ్బులను యూపీఐ ద్వారా ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.

    క్రెడిట్ కార్డు వాడకంలో తప్పనిసరి అవగాహన ఉండాలి లేదంటే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. చాలా మంది క్రెడిట్ కార్డు బిల్లును గడువులోగా చెల్లించరు. అలా చేస్తే భారీగా పెనాల్టీ పడుతుంది. బాకీ ఉన్న బిల్లును చెల్లించకుంటే ఏమతుంది? అలాంటి సమయంలో ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

    మీ బకాయి మొత్తాన్ని ఒకే సారి చెల్లించని పరిస్థితిలో మీరు ఉంటే ఈఎంఐ రూపంలో చెల్లించుకోవచ్చు. దీని వల్ల ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. లేదంటే ఆ బకాయిని మరో కార్డుకు బదిలీ చేసుకొని పర్సనల్ లోన్ గా కూడా చెల్లించే వెసులుబాటు ఉంటుంది.

    తక్కువ వడ్డీ రేట్లు..
    వ్యక్తి గత రుణాలతో పోల్చుకుంటే క్రెడిట్‌ కార్డుతో ఉపయోగించుకునే డబ్బుకు వడ్డీ తక్కువగా ఉంటుంది. అందుకే కాలక్రమేణా వడ్డీ ఆదా అవుతుంది. బాకీని వేగంగా తీర్చేందుకు సులభం అవుతుంది. మీ కార్డు బిల్లు మొత్తం తీర్చడంలో ఇబ్బంది ఉంటే బ్యాంకు నుంచి లేదా ఇతర సంస్థల నుంచి వ్యక్తిగత రుణం తీసుకొని కార్డు బిల్లును చెల్లించవచ్చు.

    క్రెడిట్‌ స్కోర్..
    ఒక వేళ ఏదైనా కారణాలతో బిల్లు గడువులోగా కట్టకుంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరుగుతుంది. ఇలా కాకుండా రుణంతో ఒకేసారి బాకీ తీరిస్తే, క్రెడిట్‌ స్కోరు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు ఆర్థిక నిపుణులు.

    ఫీజుల బాధ..
    క్రెడిట్ కార్డు బిల్లు గడువులోగా చెల్లించకుంటే ఆయా కార్డును బట్టి భారీ పెనాల్టీ పడుతుంది. అదే బ్యాంకుల నుంచి రుణం తీసుకొని, చెల్లిస్తే.. వీటి బాధ ఉండదు. రుణం తీసుకునే ముందు కూడా కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. మీ క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించేందుకు వ్యక్తి గత రుణం తీసుకునే అర్హత మీకు ఉందా తెలుసుకోవడం ముఖ్యం. దీనికి మీ బ్యాంకును సంప్రదించాలి. క్రెడిట్‌ స్కోర్, ఆదాయం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని బ్యాంకులు రుణాన్ని మంజూరు చేస్తాయి.

    కొన్ని బ్యాంకులు 12 నెలల (ఏడాది) నుంచి నుంచి 84 నెలల వ్యవధిరపై రుణాలను మంజూరు చేస్తాయి. మీ సంపాదనను బట్టి వాయిదాలను నిర్ణయించుకోండి. బ్యాంకు నుంచి రుణం తీసుకొని క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లిస్తే సరిపోదు.. మీరు తీసుకున్న లోన్‌ ఈఎంఐ సరిగ్గా చెల్లించడం ముఖ్యం. లేదంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది.