Homeఎంటర్టైన్మెంట్Bellamkonda Sai Srinivas Engagement: పెళ్లి పీటలు ఎక్కబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. పెళ్లి కూతురు...

Bellamkonda Sai Srinivas Engagement: పెళ్లి పీటలు ఎక్కబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. పెళ్లి కూతురు ఎవరో మీరే చూడండి!

Bellamkonda Sai Srinivas Engagement: టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లి భాజాలే వినిపిస్తున్నాయి. రీసెంట్ గానే విజయ్ దేవరకొండ , రష్మిక జంట పెళ్లి చేసుకున్నారు. గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ కూడా జరిగింది. నేడు అల్లు శిరీష్ , నయనికా పెళ్లి జరగబోతుంది. ఇప్పుడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంతు వచ్చేసింది. గత కొంత కాలంగా ఈ యంగ్ హీరో కావ్య రెడ్డి అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నాడు. వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు. అనేక సందర్భాల్లో వీళ్ళు కారులో కలిసి వెళ్లడాన్ని కూడా గమనించారు జనాలు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

Also Read: ఇరాన్ ఉచ్చులో చిక్కుకున్న అమెరికా.. మునిగిపోక తప్పదా?

వీళ్లిద్దరు ఇప్పుడు ఈ ఆదివారం రోజున , అనగా ఆదివారం రోజున కుటుంబ సభ్యుల సమక్ష్యం లో నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. ఇక కావ్య రెడ్డి విషయానికి వస్తే ఈమె సినీ ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయి కాదు. ఈమె తాతయ్య జడ్జీ గా పని చేసేవాడు, తండ్రి ప్రస్తుతం హైదరాబాద్ లోనే టాప్ లాయర్ గా పని చేస్తున్నాడు. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందో ఎవరికీ తెలియదు కానీ, ఇద్దరి కుటుంబాలు కూడా వీళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారు. వచ్చే నెలలో వీళ్లిద్దరి వివాహం జరిగే అవకాశం ఉంది. గతంలో బెల్లం కొండా సాయి శ్రీనివాస్ పలువురు హీరోయిన్స్ తో డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఈ దెబ్బతో తేలిపోయింది.

ఇక ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే , కెరీర్ ప్రారంభం లో రెండు మూడు హిట్స్ పడ్డాయి కానీ, ఆ తర్వాత మాత్రం వరుసగా ఫ్లాప్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది. అల్లుడు అదుర్స్ చిత్రం తో టాలీవుడ్ కి భారీ గ్యాప్ ఇచ్చాడు. ఈలోపు బాలీవుడ్ లోకి అడుగుపెట్టి , మన టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘ఛత్రపతి ‘ ని రీమేక్ చేసాడు. ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఆయన టాలీవుడ్ లోకి ‘భైరవం’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది. కానీ ఆ తర్వాత విడుదలకైనా ‘కిష్కిందపురి’ మాత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ చేతుల్లో హైందవ , టైజన్ నాయుడు వంటి చిత్రాలు ఉన్నాయి. ఒకప్పటి తో పోలిస్తే ఇప్పుడు బెల్లంకొండ కెరీర్ చాలా బాగుంది అనే చెప్పాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version