Sankashti Chaturthi 2024: ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం. ప్రతి రోజు ఒక దేవున్ని పూజించడం అనేది హిందువులు సంప్రదాయం. అయితే హిందూ మతంలో క్యాలెండర్‌లోని ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేసినట్టే.. ఒకొక్క తిథికి దాని సొంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. తిథులు కూడా ఏదో ఒక దేవతకు అంకితం చేశారు. అయితే తిధుల్లో చతుర్థి తిథి కూడా గణేశుడి పూజకు చాలా విశిష్టమైనదిగా పరిగణిస్తారు. ప్రతి నెల కృష్ణ పక్షం, శుక్ల పక్షం లో వచ్చే చతుర్థి తిథి రెండూ గణేశుడికి అంకితమనే తెలిసిందే. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి రాబోతోందనే విషయం తెలిసిందే. ఇక ఈ తిథిని వినాయక చతుర్థి అంటారు. వినాయక చతుర్థి రోజున గణపతిని పూజించడం ద్వారా ఎప్పటి నుంచో ఉన్న ఆటంకాలు మొత్తం తొలిగిపోతాయి అని నమ్ముతారు.
వినాయక చతుర్థి ఉపవాసం చాలా మంది ఉంటారు. అయితే ఈ నెలలో సంకష్టి చతుర్థి పూజ విషయంలో గందరగోళం నెలకొంది. మరి ఈ రోజుకు సరైన తేదీ, సమయం ఏంటో ఓ సారి తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి ప్రారంభం – జూన్ 9 మధ్యాహ్నం 3.44 గంటలకు ఉంటే..జ్యేష్ఠ మాస శుక్ల పక్ష చతుర్థి తిథి ముగింపు – జూన్ 10 సాయంత్రం 04:14 గంటలకు ఉంది అంటున్నారు పండితులు. అయితే సంకష్టి చతుర్థి వ్రతం పంచాంగం ప్రకారం సంకష్టి చతుర్థి వ్రతం జూన్ 10, 2024న మాత్రమే చేయాలట.
సంకష్టి చతుర్థి చంద్ర దర్శన సమయం – 2 గంటల 47 నిమిషాలకు ఉంటేజ. సంకష్టి చతుర్థి చంద్రాస్తమయం సమయం రాత్రి 10:54లకు ఉందట. అటువంటి పరిస్థితిలో.. భక్తులు తమ సౌలభ్యం ప్రకారం ఈ కాలంలో వినాయకుడిని పూజించుకోవచ్చు. ఇక ఈ రోజు మీరు పూజ చేసుకొనేటప్పుడు ఓ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు ఉంటాయట. త్రయామయాఖిలబుద్దిదాత్రే బుద్దిప్రదీపాయ సురాయ నిత్య సత్యాయ చ నిత్య బుద్ధి నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్. అన్ని విఘ్నములకధిపతి వినాయకుడిని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని జపించుకోండి. అన్ని మంచే జరుగుతాయి అంటున్నారు పండితులు.