Byjus Ravindran: ప్రముఖ ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజుస్ గందరగోళ పరిస్థితులను ఎదుర్కోంటోంది.దీని వ్యవస్థాపకుడు, ప్రధాన పెట్టుబడి దారుడు అయిన బైజు రవీంద్రన్ పై వ్యతిరేకత తీవ్రంగా మారుతోంది. తాజాగా కొంతమంది పెట్టుబడిదారులు కంపెనీలోని ఉన్నతాధికారులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనను జారీ చేశారు. గతంలో కొంత మంది పెట్టుబడిదారుల నుంచి 230 నుంచి 250 మిలియన్ డాలర్లను సేకరించింది. అయితే వీటిని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ.. బోర్డ్ ఆప్ డైరెక్టర్లను పునర్నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. అంతేకాకుండా బైజు మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ వ్యవస్థాపపకుల ద్వారా కాకుండా కొత్తవారితో రన్ చేయాలని అంటున్నారు.
బైజ కంపెనీలో ప్రస్తుతం సీఈవోగా రవీంద్రన్, అతని భార్య దివ్య గోకుల్ నాథ్, సోదరుడు రిజు రవీంద్రన్ ను కొనసాగుతున్నారు. వీరిని మార్చాలని వాటాదారులు ఒక్కతాటిపైకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలా EGM నోటసును జారీ చేయడం కొత్తేమీ కాదు. గత కొంత కాలంగా బైజు కంపెనీలో ఎప్పటి నుంచో పెట్టుబడుదారులు, ఉన్నతాధికారుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ గురువారం పెట్టుబడుదారులంతా కలిసి ఓ ప్రకటన జారీ చేశారు. ఇందులో కొర్పొరేట్ గవర్నెన్స్ దుర్వినియోగం, ఇతర సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. ప్రోసస్, ఇతర వాటాదారుల ద్వారా నామినేట్ చేయబడిన డైరెక్టర్లు కొంత మంది 2023లో రాజీనామా చేశారు. కానీ మిగతా వారితో ఇబ్బందులు ఉన్నాయని ప్రకటనలో తెలిపారు.
థింక్ అండ్ లెర్న్ సంస్థ ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ఉన్నతాధికారులు పరిష్కరించిన నేపథ్యంలో వారిని ప్రశంసిస్తూనే మరోువైపు వారి నాయకత్వంలో సంస్థ భవిష్యత్ ఆందోళనకరంగా ఉంటుందని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. కరోనా తరువాత బైజుస్ అభివృద్ధి చెందినప్పటికీ నష్టాల బాటను పట్టింది. ఉద్యోగుల వేతనాలు చెల్లించడానికి ఏకంగా వ్యవస్థాపకుడు తన సొంత ఆస్తులను బ్యాంకులో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. కంపెనీని నడిపించడానికి అవసరమైన ఫండ్స్ అందడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాటాదారులు అంతా ఒక సమూహంగా ఏర్పడి ఉన్నతాధికారులను తొలగించాలని డిమాండ్ చేయడం ఆందోళన వాతావరణం ఏర్పడింది.