Foldable phones vs flip phones: కాలం మారుతున్న కొద్ది వినియోగదారుల అవసరాలు, అభిరుచులు మారిపోతున్నాయి. ఒకప్పుడు కీప్యాడ్ ఫోన్ ఉపయోగించినవారు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేకుండా కాల్ చేయడం లేదు. రకరకాల సౌకర్యాలు స్మార్ట్ ఫోన్లో ఉండడంతో చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. గ్రామాల్లో ఉండే కొందరు వృద్ధులు సైతం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉపయోగించినవారు ఫోల్డబుల్ వైపు వెళ్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ మార్కెట్లో ఈ టైప్ ఫోన్లు 65 శాతం వాటాను కలిగి ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. అసలు ఎందుకు వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు? ఈ ఫోల్డబుల్ ఫోన్లలో ఉన్న సౌకర్యాలు ఏంటి?
సాధారణంగా ప్రీమియం స్మార్ట్ ఫోన్లో 6.8 నుంచి 7 వరకు డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్లో హార్డ్వేర్ వ్యవస్థ పరిధి తక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని రకాల యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఫోల్డబుల్ మొబైల్స్ లో డిస్ప్లే విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ మొబైల్స్ మొత్తంగా 7.8 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఇందులో మూవీస్ చూడడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఏమి ఇంకా కోరుకునే వారికి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అలాగే ఇందులో మల్టీ టాస్కింగ్ యూజ్ చేయవచ్చు. ఒకేసారి పలు రకాల యాప్స్ యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది వీడియో ఎడిటింగ్, రీడింగ్ సులభంగా ఉంటుంది. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. IPX8 వాటర్ రెసిస్టెన్స్, 5G సపోర్ట్ ఉండటంతో కాలింగ్ సౌకర్యం కూడా ఉంటుంది.
ఫోల్డబుల్ మొబైల్ లో స్క్రీన్ పెద్దగా ఉంటుంది. దీంతో వీటి ద్వారా కెమెరా కూడా అద్భుతమైన పనితో పని చేస్తుంది. ఈ మొబైల్స్ లో దాదాపు 50 MP కెమెరా ఉంటుంది. అలాగే AI ఫీచర్లు నేటి తరం వారికి అనుగుణంగా పనిచేస్తాయి. ప్యాకెట్ సైజులో టాబ్ లా అనుభవం కలుగుతుంది. సినిమాలు చూసేవారికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఫోల్డబుల్ మొబైల్స్ లో ఎక్కువగా Samsung Galaxy Z Fold 7, Google Pixel Fold 2, Honor Magic V3 వంటివి ఫోల్డబుల్ మొబైల్లో ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ఈ మొబైల్స్ లో అద్భుతమైన కెమెరాతో పాటు లేటెస్ట్ వెర్షన్లో ఉన్న సాఫ్ట్వేర్ కలిగి ఉంటుంది. ఇలాంటి సౌకర్యాలు వీటిలో ఉండడంతో ఫ్లిప్ ఫోన్లో కొనుగోలు శక్తి తగ్గుతుందని నివేదికలు తెలుపుతున్నాయి. కొన్ని స్మార్ట్ఫోన్ తయారీలా కంపెనీలు సైతం ఫోల్డబుల్ మొబైల్స్ పై ఎక్కువగా పెట్టుబడును పెడుతున్నట్లు తెలుస్తోంది.