https://oktelugu.com/

Horoscope : సూర్య, శని గ్రహాల కలయిక.. ఈ రాశుల్లో ఎటువంటి మార్పులు జరుగుతాయో తెలుసా?

2024 ఫిబ్రవరిలో సూర్యుడు, శని గ్రహాల కలయిక జరగనుంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులపై అధికంగా ప్రభావం ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : February 2, 2024 / 01:17 PM IST

    Horoscope

    Follow us on

    Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులపై గ్రహాల ప్రభావం ఉంటుంది. ప్రతి రాశి సొంత విలువలు కలిగి ఉన్నప్పటికీ వీటిపై సూర్యుడి ప్రభావం అధికంగా ఉంటుంది. సూర్యుడితో కొన్ని గ్రహాలు కలవడం వల్ల కొన్ని రాశుల్లో అనూహ్య మార్పులు వస్తాయి. 2024 ఫిబ్రవరిలో సూర్యుడు, శని గ్రహాల కలయిక జరగనుంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులపై అధికంగా ప్రభావం ఉంటుంది. దీంతో ఆ రాశులు కలిగిన జీవితాల్లో అనూహ్య మార్పులు రానున్నాయి. ఈ సంయోగం వల్ల కొందరికి మేలు జరగగా.. మరికొందరికి కీడు జరగనుంది. 2024 ఫిబ్రవరిలో సూర్యుడు, శని కలయికతో ప్రధానంగా 4 రాశులపై ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మరి ఈ రాశుల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం..

    ఫిబ్రవరిలో సూర్యుడు , శని గ్రహాలు ఒకే తాటిపైకి రానున్నాయి. ఈ నేపథ్యంలో కర్కాటకం, మిథునం, సింహ, కుంభ రాశి జీవితాల్లో మార్పులు రానున్నాయి. సూర్య, శని గ్రహాల కలయిక వల్ల కర్కాటక రాశి వారికి మేలు కంటే కీడే ఎక్కువగా ఉండనుంది. ఈ రాశివారు కొత్త గా ఏ పనిని మొదలు పెట్టకుండా ఉండడమే మంచిది. పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందుకు వెళ్లాలి. శని సంయోగం కర్కాటకంలోని ఎనిమిదవ గ్రహంలో జరుగుతుంది. అందువల్ల ఫిబ్రవరిలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి.

    సూర్య, శని సంయోగం వల్ల మిథునం రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. వీరు ఏ పని చేసినా విజయమే వర్తిస్తుంది. వ్యాపారులు పెట్టుబడులు పెట్టి ముందుకు వెళ్లొచ్చు. కొత్త పనులు చేపట్టవచ్చు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ఈ రాశివారు ముందుకు వెళ్తారు. అలాగే సింహ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. వీరు వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. శత్రువులు ఈ రాశివారిపై ఆధిపత్యాన్ని చెలాయించే అవకాశం ఉంది. న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటారు.

    కుంభ రాశి వారు కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఈ రాశివారు కొత్త ఉద్యోగం కంటే ఉన్నదాంట్లోనే కొనసాగడం మంచిది. ఫిబ్రవరి నెల మొత్తం ముఖ్యమైన నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు సైతం కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందుకు వెళ్లాలి. సూర్య, శని సంయోగం 30 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈసారి కలయిక పై రాశుల వారి జీవితాల్లో ఎటువంటి మార్పులు ఉంటాయో చూడాలి.