https://oktelugu.com/

సోలార్ ప్యాన‌ల్ బిజినెస్ తో లక్షల్లో సంపాదించవచ్చు.. ఎలా అంటే..?

దేశంలో చాలామంది యువతీయువకులు వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. కొత్త వ్యాపారం మొదలుపెట్టాలంటే నష్టం వస్తుందని భయాందోళనకు గురై కొంతమంది కొత్త వ్యాపారానికి ఆసక్తి చూపడం లేదు. సొంతంగా డబ్బులు ఉండి నష్టాలను భరించగల సామర్థ్యం ఉన్నవాళ్లు మాత్రమే వ్యాపార రంగం వైపు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టి లాభాలు రాకపోతే మాత్రం నష్టపోయే అవకాశం ఉంటుంది. వ్యాపారంపై కనీస అవగాహనతో పాటు చేసే విధానం తెలిసి ఉంటే మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 11, 2021 5:53 pm
    Follow us on

    Solar Power Business Opportunities in India దేశంలో చాలామంది యువతీయువకులు వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. కొత్త వ్యాపారం మొదలుపెట్టాలంటే నష్టం వస్తుందని భయాందోళనకు గురై కొంతమంది కొత్త వ్యాపారానికి ఆసక్తి చూపడం లేదు. సొంతంగా డబ్బులు ఉండి నష్టాలను భరించగల సామర్థ్యం ఉన్నవాళ్లు మాత్రమే వ్యాపార రంగం వైపు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టి లాభాలు రాకపోతే మాత్రం నష్టపోయే అవకాశం ఉంటుంది.

    వ్యాపారంపై కనీస అవగాహనతో పాటు చేసే విధానం తెలిసి ఉంటే మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనీసం 70,000 రూపాయలతో సోలార్ ప్యానల్ బిజినెస్ ను మొదలుపెట్టి సులభంగా డబ్బులను సంపాదించుకోవచ్చు. మార్కెట్ లో ప్రస్తుతం సోలార్‌ ప్యానెల్స్‌ ధర 80,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ ప్యానెల్స్ కు ప్రత్యేక సబ్సిడీలు ఇస్తున్నాయి.

    ఎక్కువ మొత్తంలో డబ్బు లేని వాళ్లు బ్యాంక్ నుంచి రుణం తీసుకుని ఈ వ్యాపారంను మొదలుపెట్టవచ్చు. పునరుత్పాదక ఇంధన అభివృద్ధి అథారిటీని సంప్రదించి సోలార్ ప్యానెల్స్ ను సులభంగా కొనుగోలు చేయవచ్చు. సబ్సిడీ కోసం ఫారమ్‌ తీసుకుని తక్కువ ధరకే సోలార్ ప్యానెల్స్ ను పొందవచ్చు. సోలార్ ప్యానెళ్ల ద్వారా వచ్చే కరెంట్ ను గ్రిడ్ కు ఇచ్చి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

    సోలార్ ప్యానెల్స్ లైఫ్ టైమ్ 25 సంవత్సరాలు కాగా వీటి నిర్వహణకు ఎలాంటి ఖర్చు ఉండదు. ఈ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్ ఇంటి కోసం వినియోగించుకోవచ్చు. రెండు కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌లను ఇన్ స్టాల్ చేస్తే నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రాష్ట్రంలో నిర్ణయించిన రేటు ప్రకారం డబ్బులను పొందే అవకాశం ఉంటుంది.