https://oktelugu.com/

హుజురాబాద్ లో షర్మిల మద్దతు వీరికే

హుజురాబాద్ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. తమ వైఖరి ప్రకటిస్తున్నాయి. దీంతో వైఎస్ఆర్ టీపీ కూడా తన మద్దతు నిరుద్యోగులకు అని ప్రకటించింది. నియోజకవర్గంలోని సిరిసేడు గ్రామంలో మంగళవారం జరిగిన నిరుద్యోగ సమస్యల నిరాహార దీక్ష సందర్భంగా షర్మిల మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై షర్మిల నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. హుజురాబాద్ ఉప ఎన్నిక వల్ల రాజకీయ పార్టీలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ కేవలం ప్రతిష్ట కోసమే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : August 11, 2021 / 05:48 PM IST
    Follow us on

    హుజురాబాద్ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. తమ వైఖరి ప్రకటిస్తున్నాయి. దీంతో వైఎస్ఆర్ టీపీ కూడా తన మద్దతు నిరుద్యోగులకు అని ప్రకటించింది. నియోజకవర్గంలోని సిరిసేడు గ్రామంలో మంగళవారం జరిగిన నిరుద్యోగ సమస్యల నిరాహార దీక్ష సందర్భంగా షర్మిల మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై షర్మిల నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.

    హుజురాబాద్ ఉప ఎన్నిక వల్ల రాజకీయ పార్టీలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ కేవలం ప్రతిష్ట కోసమే ఈ తిప్పలు. నిరుద్యోగులు పోటీ చేస్తే మద్దతు ఇస్తామని చెప్పడంతో ఆమె రాజకీయ చతురత చూపినట్లు తెలుస్తోంది. పోటీ చేయకనే నిరుద్యోగుల సమస్యపై మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా నామినేషన్ వేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు వైఎస్సార్ టీపీకి వచ్చినట్లే అని తెలిసిపోతోంది. దీంతో సరైన సమయంలో బాగా ఆలోచించి ఉప ఎన్నికపై తనదైన శైలిలో నిర్ణయం ప్రకటించినట్లు సమాచారం.

    ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తమ పథకాల ప్రకటనతో ఓటర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ దళిత బంధు పథకంతో ఓట్లు కొల్లగొట్టాలని భావిస్తోంది. బీజేపీ ప్రజాదీవెన యాత్ర పేరుతో ఇప్పటికే ఈటల రాజేందర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి ఓటర్లను కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల చేసిన ప్రకటన ఎంత మేర ప్రభావం చూపుతుందో తెలియాల్సి ఉంది.

    దీంతో షర్మిల తన పార్టీ విధానాన్ని ప్రకటించి నిరుద్యోగుల పక్షమే అని తెలియజేసింది. జనలా మద్దతు ఎంత ఉంది? నిరుద్యోగుల సమస్యలపై ఎంత మేర మంది అనుకూలంగా ఉన్నారు అనే విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాడేందుకు షర్మిల ఇప్పటికే పలు రకాలుగా దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో షర్మి పార్టీ వైపు ఎంత మంది నిలుస్తారో తెలిసేలా చేస్తున్నారు.