BMW Cars
BMW : జర్మన్ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ వచ్చే నెల అంటే ఏప్రిల్ నుంచి ఇండియాలో తన కార్ల ధరలను భారీగా పెంచబోతుంది. ఈ ధరల పెరుగుదల బీఎండబ్ల్యూ, మినీ కార్లు రెండింటికీ వర్తిస్తుంది. రెండు బ్రాండ్లు బీఎండబ్ల్యూ గ్రూప్ కిందకు వస్తాయి. ఇండియాలో కంపెనీ లైనప్‌లో ఉన్న అన్ని వాహనాల ధరలు 3 శాతం పెరుగుతాయని కంపెనీ ప్రకటించింది. పెరిగిన ధర మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతుంది. భారతదేశంలో అనేక బీఎండబ్ల్యూ కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో BMW 2 సిరీస్ నుంచి BMW XM వరకు ఉన్నాయి. మరోవైపు, MINI లైనప్ లో కూపర్ S, న్యూ జనరేషన్ కంట్రీమ్యాన్ ఉన్నాయి.
Also Read : షాకింగ్.. రూ.1000కోట్ల విలువైన మెర్సిడెస్ కొన్న ఇండియన్స్
ధరల పెరుగుదలకు గల కారణాన్ని బీఎండబ్ల్యూ వెల్లడించలేదు. కానీ వాహన తయారీదారు నిర్ణయం వెనుక పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు ఒక ముఖ్య కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా, మ్యూనిచ్‌కు చెందిన ఆటోమేకర్ కొత్త ఆర్థిక సంవత్సరంలో ధరలను పెంచిన మొదటి లగ్జరీ కంపెనీగా నిలిచింది. ఇప్పటివరకు మారుతి సుజుకి, టాటా మోటార్స్, కియా, హ్యుందాయ్ వంటి ప్రధాన ఆటో తయారీదారులు ఏప్రిల్ నుండి తమ తమ మోడల్ శ్రేణులలో ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఇండియాలో బీఎండబ్ల్యూ చాలా మోడల్ కార్లను అమ్మకానికి ఉంచింది. ఇందులో స్థానికంగా అసెంబుల్ చేయబడిన.. పూర్తిగా ఇంపోర్ట్ చేసుకున్న మోడల్స్ ఉన్నాయి. బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్ LWB, 5 సిరీస్ LWB, 7 సిరీస్, X1, X3, X5, X7, M340i, iX1 LWB అన్నీ స్థానికంగా అసెంబుల్ చేయబడిన మోడల్స్. మరోవైపు, బీఎండబ్ల్యూ i4, i5, i7, iX, Z4 M40i, M2 కూపే, M4 కాంపిటీషన్, M4 CS, M5, M8 కాంపిటీషన్ కూపే, XM హైబ్రిడ్ SUV లు కంప్లీట్ బుల్డ్ యూనిట్స్ (CBU)గా భారతదేశానికి వస్తాయి. భారతదేశంలో బీఎండబ్ల్యూ కార్ల ధరలు రూ.43.90 లక్షల నుండి రూ.2.60 కోట్ల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. 3 శాతం చొప్పున పెరుగుదల చూసుకుంటే అత్యంత ఖరీదైన కారు ధర రూ.7 లక్షలకు పైగా పెరుగుతుంది.
ఈ త్రైమాసికంలో బీఎండబ్ల్యూ మూడు కొత్త ప్రొడక్ట్స్ ప్రారంభించింది. కొత్త తరం BMW X3 ప్రారంభ ధర రూ. 75.80 లక్షలకు లాంచ్ చేసింది. అయితే భారతదేశానికి ప్రత్యేకమైన iX1 LWB ఆకర్షణీయమైన ధర రూ. 49 లక్షలకు వస్తుంది. చివరగా, కొత్త MINI కూపర్ S జాన్ కూపర్ వర్క్స్ (JCW) వేరియంట్ రూ. 55.90 లక్షల(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసింది. ఈ మూడు మోడళ్లు ఆటో ఎక్స్‌పో 2025లో ప్రారంభించింది. కొత్త X3, iX1 LWB డెలివరీలు సంవత్సరం ప్రారంభంలో ప్రారంభమయ్యాయి. అయితే కస్టమర్‌లు ఏప్రిల్ నుండి MINI కూపర్ S JCWని పొందుతారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Bmw bmw gave a huge shock to customers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com