Liechtenstein
Liechtenstein : ప్రపచంలో అమెరికా, రష్యా, చైనా, భారత్ వంటి దేశాలు సైన్యానికి, ఆయుధాల(Wepans) తయారీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. చిన్న దేశాలు కూడా సొంతంగా దేశ రక్షణకు ఆయుధాలు తయారు చేసుకోవడంతోపాటు, సైన్యాన్ని సిద్ధంగా ఉంచుకుంటున్నాయి. కానీ స్విట్జర్లాండ్ – ఆస్ట్రియా మధ్య రైన్ లోయలో దాగి ఉన్న ఒక చిన్న దేశం ‘లిచ్టెన్‌స్టెయిన్‘(Lichten Stain). ఈ సంపన్న దేశంలో సైన్యం లేదు, విమానాశ్రయం లేదు, అయినా ఇది ప్రపంచంలో అత్యధిక తలసరి జీడీపీ ఉన్న దేశాల్లో ఒకటి. దీని రాజధాని వాడుజ్, వైశాల్యం 160 చ.కి.మీ., జనాభా సుమారు 40,000. ఇక్కడి ప్రజలు జర్మన్ మాట్లాడతారు. 100% ఇంటర్నెట్ వినియోగిస్తారు.
Also Read : ప్రపంచంలోనే గొప్ప ప్రదేశాలు.. భారత్ నుంచి రెండు హోటళ్లకు చోటు..
సైన్యం లేదు..
లిచ్టెన్‌స్టెయిన్‌కు సైన్యం లేకపోవడం ఒక ప్రత్యేకత. 1866లో ఆస్ట్రో–ప్రష్యన్ యుద్ధం తర్వాత ఆర్థిక కారణాలతో సైన్యాన్ని రద్దు చేసింది. ఇప్పుడు శాంతిభద్రతలను 125 మంది సభ్యులతో కూడిన జాతీయ పోలీసు దళం చూస్తుంది. అత్యల్ప నేరాల రేటుతో జైళ్లలో కేవలం 15 మంది ఖైదీలు ఉంటారు. ఆసక్తికరంగా, ఇక్కడ జనాభా కంటే ఉద్యోగాలు ఎక్కువ. దేశంపై దాడి జరిగితే ప్రిన్సీ్ల సెక్యూరిటీ కార్పస్ సైన్యంగా పనిచేస్తుంది.
విమానాశ్రయం కూడా..
మరో విశేషం ఏమిటంటే, ఈ దేశానికి విమానాశ్రయం లేదు. చిన్న పరిమాణం, పర్వత భూభాగం కారణంగా విమానాశ్రయం నిర్మాణం సాధ్యం కాలేదు. అయితే, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ (115 కి.మీ.), జర్మనీలోని ఫ్రెడ్రిచ్‌షాఫెన్ (85 కి.మీ.) విమానాశ్రయాలు సమీపంలో ఉన్నాయి. ఇవీ కారు లేదా రైలు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. బాల్జర్స్‌లో ప్రైవేట్ హెలికాప్టర్ ఎయిర్‌ఫీల్డ్ ఉంది. ఆర్థికంగా, లిచ్టెన్‌స్టెయిన్ ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఆహార ఉత్పత్తులు, వైన్ వంటి పరిశ్రమలతో బలంగా ఉంది. గోధుమ, మొక్కజొన్న, బార్లీ, పాల ఉత్పత్తులు కూడా ఉత్పత్తి అవుతాయి. పర్యాటక రంగం ఆర్థిక వ్యవస్థలో పెద్ద భాగాన్ని ఆక్రమిస్తుంది. అల్పైన్ ప్రాంతంలో ఉన్న ఈ దేశం స్కీయింగ్ వంటి శీతాకాల క్రీడలకు ప్రసిద్ధి.
యూద్ధాలకు దూరం..
ఈ దేశం యుద్ధాల్లో పాల్గొనకపోవడం, స్విట్జర్లాండ్‌తో ఆర్థిక ఒప్పందాలు కలిగి ఉండటం వల్ల స్థిరత్వం, శాంతిని కాపాడుతోంది. అందుకే, సైన్యం, విమానాశ్రయం లేకపోయినా, లిచ్టెన్‌స్టెయిన్ సంపన్న, సంతోషకరమైన దేశంగా నిలుస్తోంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Liechtenstein liechtenstein is a wealthy country with no army or airport
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com