https://oktelugu.com/

Car Sales: భారీగా పెరిగిన కార్ల అమ్మకాలు… ఈ రకం కార్లనే ఎక్కువగా కొంటున్న జనాలు… జూన్ నెల సేల్స్ రిపోర్ట్…

Car Sales: భారత్ లో కార్ల అమ్మకాలు మార్కెట్ లో దూసుకెళ్తున్న సమయంలో జూన్ నెల 2024 లో అమ్ముడైన టాప్ 10 ఎస్ యూవీ ల కార్ల గణాంకాలు విడుదల అయ్యాయి.ఈ గణాంకాలతో ఏ ఎస్ యూవీ కార్లు ఎక్కువగా అమ్ముడు అయ్యాయో తెలుస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 11, 2024 / 03:09 PM IST

    Best-selling Cars In June 2024

    Follow us on

    Car Sales: దేశంలో రోజు రోజుకు కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి.దీనికి కారణం ప్రజలు కార్లను కొనేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు.ఈ క్రమంలో ఊహించని రీతిలో కార్ల సేల్స్ పెరుగుతున్నాయి.దేశం లో ప్రజలు చిన్న కార్లు,ఇతర హ్యాచ్ బ్యాక్ ల కార్ల కంటే ఎస్ యువీలను కొనడానికి బాగా ఆసక్తిని చూపిస్తున్నారు.కార్ల గణాంకాలను బట్టి ఈ విభాగానికి చెందిన కార్లు ఎక్కువ ప్రజాదారణ పొందుతున్నాయి.భారతీయ ప్రజల అభిరుచి ఎస్ యూవీ ల వైపు రోజు రోజుకు పెరుగుతుంది అని కార్ల గణాంకాలు చెప్తున్నాయి.భారత్ లో కార్ల అమ్మకాలు మార్కెట్ లో దూసుకెళ్తున్న సమయంలో జూన్ నెల 2024 లో అమ్ముడైన టాప్ 10 ఎస్ యూవీ ల కార్ల గణాంకాలు విడుదల అయ్యాయి.ఈ గణాంకాలతో ఏ ఎస్ యూవీ కార్లు ఎక్కువగా అమ్ముడు అయ్యాయో తెలుస్తుంది.ఏ ఎస్ యూవీ కారును ప్రజలు అతి తక్కువ సమయం లో ఎక్కువగా కొనుగోలు చేసారు ఈ గణాంకాల నుంచి పూర్తిగా తెలుసుకోవచ్చు.

    2024 జూన్ నెలలో రిలీజ్ అయినా కార్ల గణాంకాల లో టాటా మోటార్స్ పంచ్ అగ్ర స్థానంలో ఉందని తెలుస్తుంది.ఈ జాబితాలో ఎస్ యూవీ,హ్యాచ్ బ్యాక్,సెడాన్ ల కంటే టాటా మోటార్స్ పంచ్ మొదటి స్తానం లో నిలిచింది.ఎస్ యూవీ ల జాబితాలో ఈ కారు అగ్ర స్థానంలో ఉందని సమాచారం.అన్నిటి కంటే ఎక్కువ సేల్స్ ను సాధించి టాటా మోటార్స్ పంచ్ జూన్ నెలలో అదరగొట్టింది.టాటా మోటార్స్ పంచ్ పెట్రోల్ మరియు సీఎన్జీ ఆప్షన్ లతో పాటు ఎలక్ట్రిక్ మోటార్ తో లభిస్తుంది.తాజాగా టాటా మోటార్ పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కారు కూడా అమ్మకాలలో దూసుకుపోతుంది.గత నెలలో టాటా మోటార్ పంచ్ కార్లు 18 ,238 యూనిట్లు అమ్ముడయ్యాయని సమాచారం.2023 జూన్ నెలలో కేవలం 10 ,990 టాటా మోటార్స్ పంచ్ కార్లు అమ్ముడయ్యాయని గణాంకాలు చెప్తున్నాయి.

    65 .95 శాతం పెరిగిన టాటా మోటార్స్ పంచ్ కార్ల అమ్మకాలు 7 ,248 యూనిట్లు నమోదు అయ్యాయి.ఈ జాబితాలో టాటా మోటార్స్ పంచ్ కార్ల తర్వాత హ్యుండాయ్ క్రెటా రెండవ స్థానంలో ఉంది.గత జూన్ నెలలో హ్యుండాయ్ క్రెటా కార్లు 16 ,293 యూనిట్ లు అమ్మకాలు జరిగాయి.గత సంవత్సరం 2023 జూన్ నెలలో కేవలం 14 ,447 హ్యుండాయ్ క్రెటా కార్లు అమ్మడు అయ్యాయని సమాచారం.గత ఏడాది తో పోలిస్తే ఇదే 12 .78 శాతం తక్కువ అని తెలుస్తుంది.ఇక మారుతి సుజుకి కీ చెందిన బ్రెజ్జా 13 ,172 యూనిట్ల అమ్మకాలతో మూడో స్తానం లో నిలిచింది.గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఇది 24 .52 శాతం ఎక్కువ అని గణాంకాలు చెప్తున్నాయి.

    ఈ సంవత్సరం 2024 జూన్ నెలలో కేవలం 10 ,578 మారుతి సుజుకి కీ చెందిన బ్రెజ్జా కార్లు అమ్ముడయ్యాయని సమాచారం.ఇక ఈ జాబితాలో అత్యధికంగా అమ్ముడైన మహీంద్రా కార్లలో స్కార్పియో నాలుగవ స్థానంలో ఉంది.స్కార్పియో లో స్కార్పియో క్లాసిక్,స్కార్పియో ఎన్ అని రెండు వేరియంట్లు ఉన్నాయి.జూన్ 2024 లో మహీంద్రా కు చెందిన స్కార్పియో 12 ,307 యూనిట్లు విక్రయించటం జరిగింది.గత సంవత్సరం 2023 జూన్ నెలలో కేవలం 8 ,648 మహీంద్రా కు చెందిన స్కార్పియో కార్లు అమ్ముడయ్యాయి.ఇక టాటా మోటార్స్ కు చెందిన మరొక పాపులర్ కారు ఎస్ యూవీ టాటా నెక్సాన్ ఈ జాబితాలో అయిదవ స్తానం లో నిలిచింది.గత జూన్ నెలలో ఎస్ యూవీ టాటా నెక్సాన్ కార్లు 12 ,066 యూనిట్లు అమ్ముడయ్యాయి.గత సంవత్సరం తో పోలిస్తే ఇది 12 .74 శాతం తక్కువ అని తెలుస్తుంది.