Senior Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ తమకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి వైవిద్య భరితమైన కథాంశాలను ఎంచుకొని సినిమాలు గా చేసి సక్సెస్ ఫుల్ హీరోలుగా కొనసాగుతూ ఉంటారు. ఇక ఇలాంటి సమయంలోనే వాళ్ళు చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా వాళ్లకు సపరేట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తీసుకొచ్చి పెడుతుంది. మరి ఇలాంటి క్రమంలో మంచి సినిమాలను చేస్తే హీరోల మార్కెట్ కూడా భారీగా పెరుగుతుంది. అలా కాకుండా నార్మల్ సినిమాలను చేసుకుంటూ వెళ్తే మాత్రం హీరోలకు ఫ్లాపులు రావడం తో పాటు మళ్లీ వాళ్ల ఇమేజ్ కూడా డామేజ్ అవుతూ ఉంటుంది. అయితే హీరోలు వాళ్ళు ఎంటైర్ కెరీర్ లో చాలా సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినప్పటికీ ఆడపాదడప ఫ్లాపులు కూడా వస్తూ ఉంటాయి. ఇక వాటిని తట్టుకుంటూ ముందుకు వెళుతూ ఉంటేనే వాళ్లు లైఫ్ లో సక్సెస్ ఫుల్ హీరోలుగా కొనసాగుతూ ఉంటారు.
అయితే మన హీరోలు మాత్రం కొన్ని సినిమాలను వరస్ట్ సినిమాలు గా అభివర్ణిస్తుంటారు. మన హీరోలు కూడా ఆ సినిమాలు ఎందుకు చేశామా అని చాలా వరకు బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు వాళ్ళ కెరియర్ లో చేసిన కొన్ని వరస్ట్ సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం…
చిరంజీవి
ముందుగా చిరంజీవి విషయానికి వస్తే ఈయన చేసిన సినిమాలు చాలావరకు సూపర్ సక్సెస్ లను అందుకున్నప్పటికి స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ అనే సినిమా చిరంజీవి కెరియర్ లోనే డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ సినిమాను చేయడం వలన చిరంజీవి చాలా వరకు నష్టపోయారనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ కావడం విశేషం. ఇక ఆయన ఈ సినిమాని తనకు హ్యాండిల్ చేయడం రావట్లేదు అని సినిమా మధ్యలో నుంచి తప్పుకుంటే వేరే దర్శకుడిని పెట్టి చిరంజీవి ఈ సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేసి చిరంజీవి రిలీజ్ చేశాడు. మొత్తానికైతే ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.
ఇక దీంతోపాటుగా చిరంజీవి ఎంటైర్ కెరియర్ లో వరస్ట్ సినిమాగా చెప్పుకునే మరొక సినిమా ఏంటి అంటే మృగరాజు…ఈ సినిమా ఒక హాలీవుడ్ సినిమా ఇన్స్పిరేషన్ తో తీసినప్పటికీ సినిమాలో స్క్రీన్ ప్లే అనేది తేడా కొట్టడంతో ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇంకా చిరంజీవి ఎంటైర్ కెరియర్ లో ఈ రెండు సినిమాలు చాలా వరస్ట్ సినిమాలు గా చెప్పుకోవచ్చు…
నాగార్జున
నాగార్జున కెరీర్ లో శివ సినిమా అతన్ని మాస్ హీరోగా నిలబెడితే పాన్ ఇండియాలో ఆయన చేసిన ‘రక్షకుడు ‘ సినిమా మాత్రం వరస్ట్ సినిమాగా మిగిలిపోయింది. ఇక ఈ సినిమా ఏ భాషలో సక్సెస్ సాధించలేదు. దాంతో పాటుగా భారీగా లాస్ లను కూడా తీసుకొచ్చింది…ఇక దీంతోపాటుగా వీరభద్రం చౌదరి డైరెక్షన్ లో చేసిన భాయ్ సినిమా కూడా నాగార్జునకు ఒక భారీ డిజాస్టర్ ను మూటగట్టింది…
బాలయ్య
బాలయ్య కెరియర్ లో డిజాస్టర్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక ఆయన చేసిన వరస్ట్ సినిమాల లిస్టులో ఒక్కమగాడు, విజయేంద్ర వర్మ, వీరభద్ర లాంటి సినిమాలు ఉన్నాయి. మూడు సినిమాలు కూడా ఏ రకంగాను యూజ్ అవ్వకపోగా ఆయన ఇమేజ్ ని చాలా వరకు డ్యామేజ్ చేశాయనే చెప్పాలి…
వెంకటేష్
వెంకటేష్ కెరియర్లో మెహర్ రమేష్ తో చేసిన షాడో సినిమాని వరస్ట్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఎందుకు చేసాడో వెంకటేష్ కూడా సరైన క్లారిటీ లేదనే చెప్పాలి…